Top
Batukamma

Corona Positive For Groom : పెళ్లి కొడుక్కి కరోనా.. 500 మందికి భోజనాలు!

Corona Positive For Groom : పెళ్లి కొడుక్కి కరోనా.. 500 మందికి భోజనాలు!
X
Highlights

Corona Positive For Groom : కంటికి కనిపించని ఈ వైరస్ యావత్ ప్రపంచాన్ని ఇప్పుడు వణికిస్తుంది.. ఇప్పటికే చాలా...

Corona Positive For Groom :

కంటికి కనిపించని ఈ వైరస్ యావత్ ప్రపంచాన్ని ఇప్పుడు వణికిస్తుంది.. ఇప్పటికే చాలా మందిని పొట్టనపెట్టుకుంది ఈ మహమ్మారి.. ఇది ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలియడం లేదు.. తాజాగా పెళ్లి చేసుకున్న ఓ యువకుడికి కరోనా పాజిటివ్ ని తేలింది.. అయితే ఆ పెళ్ళికి ఏకంగా 500 మంది వచ్చారు.

ఇక వివరాల్లోకి వెళ్తే.. కోటవురట్ల మండలం కొడవటిపూడి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రంగారెడ్డి జిల్లా నుంచి 20 రోజుల కిందట వచ్చాడు. ఈ నెల 5న వీఎల్‌ఎం కిట్‌తో కోవిడ్‌ పరీక్ష చేసి నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి నమూనా పంపించారు. అయితే ఫలితాలు రాకముందే ఈ నెల 15న రావికమతం గ్రామానికి చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు.

అయితే ఇచ్చిన పరీక్ష నమూనాకి సంబంధించి ఆదివారం ఫలితాలు వచ్చాయి.. అయితే ఆ ఫలితాల్లో కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. అయితే ఆ వివాహానికి సుమారుగా సుమారు 90 మంది బంధువులు పాల్గొన్నారు.

ఇక పెళ్లి అనంతరం అదే రోజున మధ్యాహ్నం ఇంటి దగ్గర పెట్టిన భోజనాల పెట్టారు.. అయితే ఈ భోజనాలకు సుమారుగా 500 మందికి పైగా పాల్గొన్నట్టుగా గ్రామస్తులు చెబుతున్నారు. ఇక పెళ్ళికి వచ్చిన వాళ్ళు భయంగా వణికిపోతున్నారు.

Next Story
Share it