Top
Batukamma

Railway Charges : త్వరలో రైల్వే చార్జీలు పెంపు!

Railway Charges : త్వరలో రైల్వే చార్జీలు పెంపు!
X
Highlights

Railway Charges May Increase Soon : ఆల్రెడీ కరోనా కష్టాల్లో ప్రజల నడ్డీ విరిచేందుకు ప్రయత్నం చేస్తోంది కేంద్ర...

Railway Charges May Increase Soon : ఆల్రెడీ కరోనా కష్టాల్లో ప్రజల నడ్డీ విరిచేందుకు ప్రయత్నం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. కరోనా దెబ్బతో మార్చి నుంచి రైళ్ల రాకపోకలు బంద్ అయ్యాయి. దీంతో ప్రజల ప్రయాణాలు నిలిచిపోయాయి.

అన్ లాక్ ప్రక్రియ మొదలయ్యాక ప్రత్యేక రైళ్ల రాకపోకలకు కేంద్రం అనుమతి ఇచ్చింది. క్రమంగా రైళ్ల సంఖ్య పెంచుతూ పోతోంది. దీంతో ప్రయాణికుల రాకపోకలు పెరిగాయి.

ఇదే టైంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే రైల్వే చార్జీలు పెంచే అవకాశమున్నట్టు తెలుస్తోంది. వచ్చే నెల మొదటి వారంలో జరిగే కేబినెట్ భేటీలో దీనికి ఆమోదముద్ర వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

యూజర్ డెవలప్ మెంట్ చార్జీల పేరుతో కొత్తగా డబ్బులు వసూలు చేయనున్నారు. దీని వల్ల ఒక్కో టికెట్ పై 10 రూపాయల నుంచి 35 రూపాయల వరకు పెరిగే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అయితే.. రైలును బట్టి, ప్రయాణించే కోచ్ ను బట్టి యూజర్ డెవలప్ మెంట్ చార్జీలు మారనున్నాయి. మొత్తం 5 కేటగిరీల్లో యూజర్ డెవలప్ మెంట్ చార్జీలు వసూలు చేయనున్నారు.

ఏసీ 1 : రూ.35 నుంచి రూ.40

ఏసీ 2 : రూ.30

ఏసీ 3 : రూ.25 నుంచి రూ. 30

స్లీపర్ క్లాస్ కు 10 రూపాయల వరకు వసూలు చేసే ఛాన్స్ ఉంది.

ఇటీవల ప్రైవేటు కంపెనీలకు అప్పజెప్పిన స్టేషన్లలోనూ ఈ చార్జీలు వసూలు చేయనున్నారు. దీంతో ప్రయాణికులపై భారీగానే భారం పడే అవకాశముంది.

ఆల్రెడీ పేదలు, రైతులకు వ్యతిరేకంగా వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చారని కేంద్రంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. త్వరలోనే బిహార్ లో అసెంబ్లీ ఎన్నికలున్నాయి. ఈ టైంలో రైల్వే చార్జీల పెంపు నిర్ణయం తీసుకుంటే పరిస్థితులు ఎలా మారుతాయన్నది ఆసక్తికరంగా మారింది.

Next Story
Share it