Top
Batukamma

Rajamouli tested positive for corona : రాజమౌళిని వదలని వర్మ.. ఏందీ ఖర్మ..!

Rajamouli tested positive for corona : రాజమౌళిని వదలని వర్మ.. ఏందీ ఖర్మ..!
X
Highlights

Rajamouli tested positive for corona : కరోనా వైరస్ ఒక్కొక్కరిగా అందర్ని పట్టేస్తోంది. ఇప్పటికే పలువురు సినీ...

Rajamouli tested positive for corona : కరోనా వైరస్ ఒక్కొక్కరిగా అందర్ని పట్టేస్తోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు వైరస్ బారిన పడ్డారు. లెటెస్ట్ గా స్టార్ డైరెక్టర్ రాజమౌళికి కరోనా పాజిటివ్ వచ్చింది. నిన్న తన ఫ్యామిలీకి కరోనా వైరస్ నిర్ధారణ అయ్యిందని ఆయన తన సోషల్ మీడియా ప్లాట్ ఫాంలో తెలియజేశాడు.

జ్వరం తప్ప ఇతర లక్షణాలేవీ లేవని రాజమౌళి చెప్పాడు. అందరం ఆరోగ్యంగానే ఉన్నాం. ప్రికాషన్స్ తీసుకుంటున్నాం అని చెప్పాడు.

[embed]https://twitter.com/ssrajamouli/status/1288494756360622080[/embed]

అంతేకాదు మరో గొప్ప విషయం కూడా చెప్పాడు రాజమౌళి. తాము శరీరంలో యాంటీబాడీలు డెవలప్ అవడం కోసం వేచి చూస్తున్నామని.. ప్లాస్మా డొనేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాడు.

అయితే.. రాజమౌళి ట్వీట్ కు ఫ్యాన్స్, ఇతర సెలబ్రిటీలు గెట్ వెల్ సూన్ అని రిప్లే పెడితే.. రాంగోపాల్ వర్మ మాత్రం ఇక్కడ కూడా తన స్టైల్ చూపించాడు. నీ సోల్జర్ బాహుబలిని పిలిపించు.. వైరస్ ను ముడ్డి మీద తన్ని పంపించేస్తాడు.. అంటూ ట్వీట్ చేశాడు.

[embed]https://twitter.com/RGVzoomin/status/1288499656201101312[/embed]

ఇంకేముంది ఈ ట్వీట్ కింద వర్మ ఫ్యాన్స్.. రాజమౌళి ఫ్యాన్స్ మధ్య వార్ మొదలైంది.

Next Story
Share it