Tv9 Rajinikanth : టీవీ9 నుంచి రజినీకాంత్ ఔట్

త్వరలోనే మరికొందర్ని బయటకు పంపించేసి.. వారి స్థానంలో తమ అనుచరగణాన్ని పెట్టుకునేందుకు అంతా సిద్ధమైందనే చర్చ జరుగుతోంది.
Rajinikanth resigned to tv9 : తెలుగు వార్తా టెలివిజన్ రంగంలో ప్రభంజనం సృష్టించిన టీవీ 9.. కొద్ది రోజులుగా వివాదాల్లో ప్రభంజనం సృష్టిస్తోంది. టీవీ9 ను మైహోం గ్రూప్ టేకోవర్ చేసినప్పటి నుంచి వివాదాలు మరింతగా ముసురుకున్నాయి. ఛానల్ సీఈవో, వాటాదారుల్లో ఒకరమైన రవిప్రకాశ్ తొలగింపు, కేసుల ఇష్యూ అప్పట్లో సంచలనం సృష్టించింది.
టీవీ9ను స్థాపించింది రవిప్రకాశ్. ఆయన చాలామందికి టీవీ9 ద్వారా లైఫ్ ఇచ్చారు. యాంకర్లు, రిపోర్టర్లు, సబ్ ఎడిటర్లు.. ఇలా చాలామందికి ఆయన ఓ గురువు. టీవీ9లో రవిప్రకాశ్ ఉన్నప్పుడు.. ఆయన వెళ్లిపోయాక కూడా ఆయన అనుచరులు టీవీలో చాలా మంది ఉండిపోయారు.
అయితే.. రవిప్రకాశ్ తో సంబంధాలున్న వారిని ఒక్కొక్కరిని బయటకు సాగనంపుతున్నట్టు తెలుస్తోంది. మొత్తం రవిప్రకాశ్ టీంను కొత్త మేనేజ్ మెంట్ టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే టీవీలో ప్రస్తుతం కీలక పదవిలో ఉండి.. రెగ్యులర్ గా టీవీ డిబేట్లు నడిపించే రజినీకాంత్(Tv9 Rajinikanth) ను టీవీ నుంచి బయటకు వెళ్లగొట్టినట్టు తెలుస్తోంది. సేవలు ఇక చాలు.. వెళ్లిపోండని కాస్త దురుసుగానే చెప్పినట్టు తెలుస్తోంది.
- పడుకోవడానికి పనికొచ్చే స్వాతినాయుడు .. సినిమాల్లోకి పనికిరాదా?
- ఛీ ఛీ.. జబర్దస్త్ నుంచి ముందు అనసూయను తీసిపారేయండి!
రజినీకాంత్ (Tv9 Rajinikanth) ఒక్కడే కాదు.. గతంలో వరంగల్ రిపోర్టర్ గా పనిచేసి .. ప్రస్తుతం టీవీలో సీనియర్ జర్నలిస్ట్ గా పొలిటికల్ ఇంటర్వ్యూలు చేస్తున్న దొంతు రమేష్ ను కూడా టీవీ 9 నుంచి తీసేసినట్టు తెలుస్తోంది. దొంతు రమేష్ వెళ్లిపొమ్మని చాలా రోజుల క్రితమే చెప్పినట్టు తెలుస్తోంది. ఇప్పుడు రజినీకాంత్ ను బయటకు పంపడంతో.. ఈ విషయం కూడా మీడియా సర్కిళ్లలో చక్కర్లు కొడుతోంది.
అయితే.. రజినీకాంత్, దొంతు రమేష్ ను బయటకు పంపించేసి.. వెలమ సామాజిక వర్గానికి చెందిన ఓ జర్నలిస్ట్ ను టీవీ9లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారట. ప్రస్తుతం 10టీవీలో ఇన్ పుట్ ఎడిటర్ గా ఉన్న ఆయన.. గతంలో జూపల్లి కృష్ణారావు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన దగ్గర పనిచేశారు. రజినీకాంత్, దొంతు రమేష్ ఆఫీస్ బయట అడుగు పెట్టగానే ఆయన ఛానల్ లోకి ఎంట్రీ ఇస్తారట. సామాజిక వర్గం, సన్నిహితుడు.. రెండు కలిసి రావడంతో టీవీ9లోకి తీసుకుంటున్నారని టాక్.
అయితే.. ఇటీవల టీవీ 9కు సంబంధించిన ఓ వివాదం కంపెనీ ట్రిబ్యునల్ వరకు వెళ్లింది. మైహోం గ్రూప్.. టీవీ 9ను పూర్తిగా నష్టాల్లోకి నెట్టేసిందని కంపెనీ లా ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేశారు మాజీ సీఈవో రవిప్రకాశ్. కంపెనీ టేకోవర్ చేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని... ప్రస్తుత మేనేజ్ మెంట్ కు ఆదేశాలివ్వాలని కోరారు.
- Rakesh Master : రాకేష్ మాస్టర్.. ఏంటి ఆ పిచ్చివాగుడు!
- Payal ghosh : ఇండస్ట్రీలో “హాట్” టాపిక్ పాయల్ ఘోష్..
రవిప్రకాశ్ ఫిర్యాదుతో ప్రస్తుతం మేనేజ్ మెంట్ మరింత స్పీడ్ పెంచింది. రవిప్రకాశ్ తో సన్నిహిత సంబంధాలున్నాయని విమర్శలున్న వ్యక్తులందరిని బయటకు పంపించేందుకు పర్ ఫెక్ట్ ప్లాన్ రెడీ చేసినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే వీళ్లిద్దరిని బయటకు పంపుతున్నట్టు సమాచారం.
త్వరలోనే మరికొందర్ని బయటకు పంపించేసి.. వారి స్థానంలో తమ అనుచరగణాన్ని పెట్టుకునేందుకు అంతా సిద్ధమైందనే చర్చ జరుగుతోంది.
Trending Video :
[embed]https://youtu.be/a3ODBo0XBlI[/embed]