Top
Batukamma

అయోధ్యలో భవ్య రామమందిర ఎత్తు ఎంతో తెలుసా..?

అయోధ్యలో భవ్య రామమందిర ఎత్తు ఎంతో తెలుసా..?
X
Highlights

దేశంలోని హిందువుల చిరకాల కోరిక త్వరలోనే నెరవేరబోతోంది. అయోధ్యలో భవ్య రామమందిరాన్ని చూడాలనుకున్న వారి కలలు...

దేశంలోని హిందువుల చిరకాల కోరిక త్వరలోనే నెరవేరబోతోంది. అయోధ్యలో భవ్య రామమందిరాన్ని చూడాలనుకున్న వారి కలలు త్వరలోనే నిజం కాబోతున్నాయి. మందిర నిర్మాణానికి ఇప్పటికే సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆలయ నిర్మాణంపై శ్రీరామజన్మభూమి తీర్త క్షేత్ర ట్రస్ట్ ఫోకస్ పెట్టింది.

అయోధ్యలో నిర్మించతలపెట్టిన భారీ రామమందిరానికి ఆగస్టు 5న శంకుస్థాపన చేయనున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. దీనికి సంబంధించి తమకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి కన్ఫర్మేషన్ వచ్చిందని ట్రస్ట్ సభ్యులు తెలిపారు.

ఇక.. ప్రముఖ ఆర్కిటెక్ట్ చంద్రకాంత్ సోమపుర... రామమందిరానికి ప్లానింగ్ ఇచ్చారు. అద్భుతమైన రూపంతో కళ్లు చెదిరిపోయేలా ఆలయాన్న నిర్మించనున్నారు.

రామమందిరం 161 అడుగుల ఎత్తు ఉండనుంది. దీనికి ఐదు గోపురాలు ఉంటాయి. మంచి శిల్పాకళతో రామ మందిరాన్ని నిర్మించనున్నారు.

blueprint_ram_temple

అలాగే ఆలయం బయట శ్రీరాముడి భారీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా ప్లానింగ్ ఇప్పటికే సిద్ధమైంది.

ram_temple_model_2

విశ్వహిందూ పరిషత్ సూచనల మేరకు ఆలయ నమూనాను తయారు చేశారు. అయితే. ఇందులోని కొలతల్లో కొన్ని మార్పులు చేసి నిర్మాణం చేపట్టనున్నట్టు శ్రీరామ జన్మభూమి తీర్త క్షేత్ర ట్రస్ట్ చెప్పింది.

RAM_MANDIR_BLUE_PRINT

ఆగస్ట్ లో పనులు మొదలైతే.. మూడున్నరేళ్లలో ఆలయ నిర్మాణం పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇప్పటికే 40 శాతం శిలలపై ఆకృతులు చెక్కే పని పూర్తయింది. దీంతో అనుకున్న టైంకే ఆలయ నిర్మాణం పూర్తవుతుందని ట్రస్ట్ అంటోంది.

Next Story
Share it