Top
Batukamma

Rana-Mahika Wedding card : రానా పెళ్లి పత్రిక వచ్చేసింది.. ముహూర్తం, వేదిక ఎక్కడంటే?

Rana-Mahika Wedding card : రానా పెళ్లి పత్రిక వచ్చేసింది.. ముహూర్తం, వేదిక ఎక్కడంటే?
X
Highlights

Rana-Mahika Wedding card :యంగ్ హీరో రానా త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. లాక్ డౌన్ సమయంలో తన ప్రేమకి ఎస్ అంది...

Rana-Mahika Wedding card :యంగ్ హీరో రానా త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. లాక్ డౌన్ సమయంలో తన ప్రేమకి ఎస్ అంది అంటూ తన ప్రేయసి మహికా బజాజ్ ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు రానా.. ఇక వీరి ప్రేమకి కూడా పెద్దలు కూడా ఒకే చెప్పేశారు.

మే 21వ తేదీన రానా, మిహిక కుటుంబాలు రాకా ఫంక్షన్ నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆగస్టు 08న రానా, మహిక జంట ఒకటి కాబోతుంది. ఇదే తేదిని ఆఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ పెళ్లి పత్రికతో ముందుకు వచ్చారు.

https://youtu.be/iChz6S3YiNA

అందిరి లాగా కాకుండా ఈ పెళ్లి పత్రికను చాలా కొత్తగా డిజైన్ చేశారు. వీడియో రూపంలో డిజైన్ చేయడం మరో విశేషంగా చెప్పుకోవచ్చు. మాయాబజార్'లోని సన్నివేశాన్ని ఆడ్ చేస్తూ రానా మహిక ఫోటోలను రూపొందించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక రానా మహికల పెళ్లి.. ఆగస్టు 8వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు, చైతన్య ఎన్‌క్లేవ్, ఖాజాగూడ, మణికొండ, హైదరాబాద్‌లో జరుగుతుందని ఈ పెళ్లి పత్రికలో వెల్లడించారు. కరోనా నేపధ్యంలో జరుగుతున్న పెళ్లి కావడంతో పక్కా నిబంధనలతో జరుగుతుందని తెలుస్తోంది. అత్యంత సన్నిహితులు మాత్రమే దీనికి హాజరు కానున్నారు.

Next Story
Share it