Top
Batukamma

PUBG : వార్నీ.. పబ్ జి బ్యాన్ చేసింది అందుకా..?

PUBG : వార్నీ.. పబ్ జి బ్యాన్ చేసింది అందుకా..?
X
Highlights

ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా.. ఫోన్లో మాట్లాడుకున్నా.. పబ్ జి గేమ్ బ్యాన్ గురించే మాట్లాడుకుంటున్నారు.

Reason Behind Pubg Ban In India : ప్రస్తుతం దేశ ఆర్థికాభివృద్ధి మైనస్ 23 శాతాని కన్నా దిగువకు పడిపోయింది. ఓ వైపు కరోనా.. మరోవైపు ఆర్థిక సమస్యలతో దేశం అల్లాడుతోంది. అయితే.. ఇప్పుడు దేశంలోని యువత మాత్రం దీని గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు.

ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా.. ఫోన్లో మాట్లాడుకున్నా.. పబ్ జి గేమ్ బ్యాన్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఎంతసేపూ దాని గురించే డిస్కస్ చేస్తున్నారు. గేమ్ ను ఎందుకు బ్యాన్ చేశారు..? నిజంగా పబ్జి చైనా యాప్ ఏనా..? గేమ్ ను మళ్లీ తీసుకొస్తారా..? అని డిస్కషన్లు పెట్టేస్తున్నారు.

అయితే.. పబ్జి గేమ్(Pubg) ను ఎందుకు బ్యాన్ చేశారనేదే ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. దేశ భద్రతకు ముప్పుగా ఉందని నిషేధం పెట్టామని సర్కారు చెబుతోంది. కానీ దీనికి మరో కారణం ఉందంటున్నారు సోషల్ మీడియా యూనివర్సిటీకి చెందినవాళ్లు. ఏకంగా పబ్జి బ్యాన్ కు ప్రధాని మోడీకి లింక్ పెట్టేశారు.

విషయం ఏంటంటే.. ఇటీవల ప్రధాని మోడీపై సోషల్ మీడియా, ప్రధానంగా యూట్యూబ్ లో ఓ క్యాంపెయిన్ నడుస్తోంది. అదే డిస్ లైక్ ల క్యాంపెయిన్. ప్రధానమంత్రి నరేంద్రమోడీ మన్ కీ బాత్ కార్యక్రమానికి అడ్డగోలుగా డిస్ లైక్ లు వస్తున్నాయి. పనిలో పనిగా నరేంద్రమోడీ యూట్యూబ్ ఛానల్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో యూ ఛానల్ లోకి వెళ్లి మరి డిస్ లైక్ లు కొట్టేస్తున్నారు.

dislike modi

చిన్నగా మొదలైన ఈ క్యాంపెయిన్ ఇప్పుడు ఊపందుకుంది. కొందరైతే డిస్ లైక్ కొట్టి మరి స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. మరో పదిమంది డిస్ లైక్ చేసేలా చేస్తున్నారు.

ఈ వ్యవహారంతోనే ప్రధానమంత్రి నరేంద్రమోడీకి కోపం వచ్చిందట. యూట్యూబ్ ను రెగ్యులర్ గా ఫాలో అయ్యేవారిలో యూత్ ఎక్కువగా ఉంటారు. వీరిలో చాలామంది పబ్జి గేమ్ ఆడేవాళ్లు ఉంటారు. దీంతో వారిని గట్టి దెబ్బ కొట్టాలని ఫిక్స్ అయ్యారట ప్రధానమంత్రి నరేంద్రమోడీ. అందుకే పబ్జి గేమ్ ను బ్యాన్ చేసేశారట. డిస్ లైక్ లకు పబ్జి బ్యాన్ తో దెబ్బకొట్టారన్న మాట.

ఇదంతా కామెడీ కాకపోతే ఏంటి చెప్పండి.. తన వీడియోలకు డిస్ లైక్ లు కొట్టారని ప్రధానమంత్రి రంగంలోకి దిగి.. పబ్జి గేమ్ బ్యాన్ చేయిస్తారా..?

కానీ.. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. వాట్సప్, ఫేస్ బుక్ యూనివర్సిటీలు కథలు అల్లేయడంతో పీహెచ్ డీలు ప్రీగా ఇచ్చేస్తున్నాయి. కట్టుకథలను విచ్చలవిడిగా ప్రచారం చేస్తున్నాయి.

READ ALSO :

Next Story
Share it