Top
Batukamma

RGV NEW MOVIE ALLU : టాలీవుడ్ లో భారీ బాంబ్ పేల్చిన వర్మ..!

RGV NEW MOVIE ALLU : టాలీవుడ్ లో భారీ బాంబ్ పేల్చిన వర్మ..!
X
Highlights

కాంట్రవర్సీ కేరాఫ్ రాంగోపాల్ వర్మ.. ఈ సారి చాలా పెద్ద బాంబ్ పేల్చాడు. ఏకంగా ఈ సారి “అల్లు” పేరుతో సినిమా...

కాంట్రవర్సీ కేరాఫ్ రాంగోపాల్ వర్మ.. ఈ సారి చాలా పెద్ద బాంబ్ పేల్చాడు. ఏకంగా ఈ సారి “అల్లు” పేరుతో సినిమా తీయబోతున్నట్టు ప్రకటించాడు. ఇది ఒక ఫిక్షనల్ రియాలిటీ మూవీ అంటూ ట్విట్టర్ లో అనౌన్స్ చేశాడు వర్మ. ఒకరిని స్టార్ హీరోని చేయడానికి కష్టపడిన బామ్మర్ది కథ అంటూ ప్రకటించాడు.

జనరాజ్యం పార్టీ అనౌన్స్ చేయడంతో సినిమా మొదలవుతుందని చెప్పాడు. “అల్లు” అనే పేరు ఎందుకు పెట్టాడో కూడా క్లారిటీ ఇచ్చాడు వర్మ. ఇందులోని మెయిన్ క్యారెక్టర్ రకరకాల ప్లాన్ లు అల్లుతుంటాడు.. అందుకే ఆ పేరు పెట్టానని చెప్పాడు.

[embed]https://twitter.com/RGVzoomin/status/1289800404255924225?s=20[/embed]

“తనకి మంచి జరగాలి అంటే ప్లాన్ అల్లు, మరొకడికి చెడు జరగాలి అంటే ప్లాన్. అల్లు అనే స్ట్రాటర్జీ తో ప్లాన్ ల అల్లుడు లో ఆరితేరిపోయి, పెద్ద స్టార్ అయిన తన బావ పక్కనే ఉంటూ తన మైలేజీ పడిపోకుండా ఉండటానికి తమ ఇంటి “అల్లు”డు అని కూడా మర్చిపోయి ఎప్పటికప్పుడు ప్లాన్లు అల్లుతూ వుంటాడని..” వర్మ తన ట్వీట్ లో రాసుకొచ్చాడు.

ఇటీవలే అల్లు ఫ్యామిలీ, మై హోం రాజేశ్వర్ రావు ఫ్యామిలీ కలిసి ప్రారంభించిన ott ప్లాట్ ఫాంను వర్మ వదల్లేదు. “అందరితో తనని "ఆహా" అనిపించుకోవటానికి తనకి కావాల్సిన వాళ్ళకే మంచి జరిగేలా చెప్పి ప్లాన్ ల మీద ప్లాన్ అల్లుకుపోతూ ఉండే ఒక పెద్ద అల్లికల మాస్టర్ కథే ఈ "అల్లు"..” అని వర్మ చెప్పాడు.

సినిమాలో క్యారెక్టర్ల పేర్లు కూడా అనౌన్స్ చేశాడు.

A Aaravind

K Chiraaanjeevi

Prawan Kalyan

A Aaarjun

A Sheeresh

K R Chraran

N Baebu

ఫైనల్ గా మరో ఇంట్రెస్టింగ్ ఇష్యూ కూడా చెప్పాడు వర్మ. ఈ సినిమాలో థియేటర్ మాఫియా, పార్టీ టికెట్లు అమ్ముకోవడం, వెన్నుపోటు రాజకీయాలు.. దీనివల్ల ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవలు వచ్చాయనే.. విషయాలు ఉండబోవని తాను చెప్పడం లేదంటూ.. చాలా వెరైటీగా ట్వీట్ చేశాడు.

Next Story
Share it