Top
Batukamma

Rhea Chakraborty : ఆ ఒక్క ఆధారంతో రియా చక్రవర్తి దొరికిపోయింది..!?

Rhea Chakraborty : ఆ ఒక్క ఆధారంతో రియా చక్రవర్తి దొరికిపోయింది..!?
X
Highlights

సుశాంత్ మాజీ లవర్ రియా కాబట్టి అక్కడినుండి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది సీబీఐ. ఇక్కడే నమ్మలేని నిజాలు బయటకు వచ్చాయి.

Rhea chakraborty involvement in sushanth death : “ధోని” ది అన్ టోల్డ్ స్టోరీ… సినిమాతో ఓ వెలుగు వెలిగిన హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య పెద్ద దుమారాన్ని లేపింది. ఈ కేసును సీబీఐతో పాటుగా మరో రెండు కేంద్ర బృందాలు విచారణ చేస్తున్నాయి.. అయితే ఈ కేసులో మొదటినుంచి A1 నిందితురాలుగా ఉన్న రియా చక్రవర్తి(Rhea Chakraborty)ని మంగళవారం NCB అరెస్ట్ చేసింది.. అయితే సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడంలో అసలు రియా చక్రవర్తి పాత్ర ఎంత ఉంది.?

రియా చక్రవర్తి ఎవరో కాదు. టాలీవుడ్ లో సుమంత్ అశ్విన్ హీరోగా వచ్చిన తూనిగ తూనిగ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కోసం ముగ్గురు హీరోయిన్ లను ఎంపిక చేయగా రియా ఫైనల్ అయింది. బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసింది. ఆమె సినిమా కెరీర్ గురించి చెప్పుకుంటే ఇంతే మరి.

Image

కానీ సుశాంత్ మరణం తర్వాత ఆమె అసలు కథ మొదలైంది. ముందుగా సుశాంత్ ఆత్మహత్యకి నెపోటిజం కారణం అని అనుకున్నారు అంతా. కానీ ఎప్పుడైతే కేసు సీబీఐ చేతికి వెళ్లిందో కథ మొత్తం మారిపోయింది.

సుశాంత్ మాజీ లవర్ రియా కాబట్టి అక్కడినుండి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది సీబీఐ. ఇక్కడే నమ్మలేని నిజాలు బయటకు వచ్చాయి.

సుశాంత్ మరణించిన తరువాత దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి కాకుండా అయిదు కిలోమీటర్ల దూరం ఉన్న హాస్పిటల్ కి తీసుకు వెళ్లారు. ఇక్కడే సుశాంత్ కి సంబంధించిన కొన్ని ఆధారాలను మిస్ చేశారు. దీని వెనుక రియా అండ్ టీమ్ ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తోంది.

ఇక సుశాంత్ పూర్తి డిప్రెషన్ లో ఉంటే వర్కౌట్ ఎలా చేశాడు.? అది సాధ్యం కాదు కూడా. అసలు సుశాంత్ డిప్రెషన్ లో ఉన్నట్టుగా ఎప్పుడు కనిపించలేదని అతని పర్సనల్ ట్రైనర్ వెల్లడించాడు. రియా సుశాంత్ కి రాంగ్ మెడిసిన్ ఇచ్చేదని, అవసరానికి మించి ఎక్కువ డోస్ ఇచ్చేదని, ఇందులో నన్ను ఇన్వాల్ కానిచ్చేది కాదని చెప్పుకొచ్చాడు. అటు సుశాంత్ ఫ్రెండ్స్, మాజీ లవర్ అంకితా కూడా సుశాంత్ ఎపుడూ డిప్రెషన్ లో ఉన్నట్టుగా చూడలేదని వెల్లడించారు.

sushant-singh-rajput

ఇక సుశాంత్ చనిపోయిన రూమ్ ఎత్తు 9 అడుగుల మూడు అంగుళాలు... సుశాంత్ ఎత్తు 5 అడుగుల 10 అంగుళాలు.. ఫ్యాన్ బెడ్ మధ్య 5 అడుగుల 11 అంగుళాలు ఎత్తు ఉంది. ఇలా అయితే సుశాంత్ ఎలా ఆత్మహత్య చేసుకున్నట్టు? దీన్ని ముంబై పోలీసులు లెక్కలోకి తీసుకోలేదు.

ఇక సీబీఐ విచారణలో సుశాంత్ తన మాట వినకపోతే తన బలహీనతలను బయటపెడతానని రియా పలుమార్లు బ్లాక్ మెయిల్ చేసినట్టుగా తేలింది. అంతేకాకుండా ఆమెతో పాటుగా ఆమె కుటుంబంలోని పలువురు అకౌంట్ లోకి సుశాంత్ అకౌంట్ నుంచి 11 కోట్లు ట్రాన్స్ఫర్ అయ్యాయి.. అలా 46 కోట్ల నుంచి సుశాంత్ అకౌంట్స్ ఒక్క కోటి రూపాయలకి వచ్చింది. దీనిపైనే ముంబై పోలీసులు ఆరా తీయలేదు.

ఇక సుశాంత్ ని తన ఫ్యామిలీతో కాంటాక్ట్ లో ఉండకుండా రియా కొన్ని కండిషన్స్ పెట్టింది.. అలా అక్కడి నుంచి సుశాంత్ డిప్రెషన్ మరింతగా ఎక్కువ అయింది. ఇలా తన కంట్రోల్ లో లేకుండా చేశాక సుశాంత్ ఇంటి నుంచి రియా బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేముందు సుశాంత్ కి సంబంధించిన విలువైన ఆధారాలను ( లాప్ ట్యాప్) వంటిని తన వెంట తీసుకువెళ్లింది.

ఇక జూన్ 6న సుశాంత్ మేనేజర్ ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. దీనితో సుశాంత్ లో మరింత భయం మొదలైంది. ఆమె చావుకి తనని కారణంగా చూపుతుందని సుశాంత్ భయపడ్డాడు. అన్నట్టుగానే రియా పలుమార్లు బెదిరించింది కూడా. దీనిని తట్టుకోలేకపోయిన సుశాంత్ చనిపోయాడు. అయితే ఇది హత్యా లేక ఆత్మహత్య అన్నది మాత్రం తెలియాలి. కానీ ముంబై పోలీసులు ఇది పక్కాగా ఆత్మహత్య ని సర్టిఫికెట్ ఇచ్చేశారు.

ఇక ఈ కేసును వాదించడానికి రియా బడా లాయర్ ని పెట్టుకుంది. ఇతను రోజుకు పది లక్షల ఫీజు తీసుకుంటాడు. కేవలం మూడు నాలుగు సినిమాలు, షోలు చేసినా రియా అతన్ని ఎలా పెట్టుకుంది..? గతంలో ఇదే లాయర్ సల్మాన్ ఖాన్ లాంటి బడా హీరోల కేసులను వాదించాడు కూడా. ఇక సుశాంత్ ని రియా డ్రగ్స్ ఇచ్చెదని సీబీఐ విచారణలో తేలింది. ఇంకా తెలియాల్సిన విషయాలు కూడా ఉన్నాయి. ఇంకా ఇందులో చాలా మంది పేర్లు కూడా బయటకు వస్తాయి కూడా.!

Read Also

Next Story
Share it