Top
Batukamma

Russia Corona Vaccine : జస్ట్ మూడు రోజులే.. కరోనా వ్యాక్సిన్ వచ్చేస్తోంది..!

Russia Corona Vaccine : జస్ట్ మూడు రోజులే.. కరోనా వ్యాక్సిన్ వచ్చేస్తోంది..!
X
Highlights

Russia Corona Vaccine : కరోనా భయంతో వణికిపోతున్న ప్రజలకు రష్యా గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా వ్యాక్సిన్ కు సంబంధించిన కీలక విషయం వెల్లడించింది.

Russia Corona Vaccine : కరోనా భయంతో వణికిపోతున్న ప్రజలకు రష్యా గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా వ్యాక్సిన్ కు సంబంధించిన కీలక విషయం వెల్లడించింది. కరోనా నివారణ కోసం తయారు చేసిన వ్యాక్సిన్ ను (Russia Corona Vaccine) ఈ నెల(ఆగస్ట్) 12న విడుదల చేయనున్నట్టు ప్రకటించింది.

రష్యా రక్షణమంత్రిత్వ శాఖ, గామలేయా రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ కలిసి ఈ వ్యాక్సిన్ ను డెవలప్ చేశాయి. మొదటి దశంలో మెడికల్ సిబ్బంది, వృద్ధులకు వ్యాక్సిన్ ఇస్తామని రష్యా ప్రతినిధులు తెలిపారు. వ్యాక్సిన్ ఎంత వరకు సేఫ్, ఎంత పర్ ఫెక్ట్ గా పనిచేస్తోందని తెలుసుకునేందుకు 1,600 మందిపై పరీక్షలు జరిపామని చెప్పారు.

తాము తయారు చేసిన వ్యాక్సిన్ ద్వారా వైరస్ సోకిన వారి శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని గామలేయా రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ప్రతినిధులు తెలిపారు. వ్యాక్సిన్ (Russia Corona Vaccine) ట్రయల్స్ లో పాల్గొన్న వారిలో వ్యాధి నిరోధక శక్తి కనిపించిందని వారు చెప్పారు.

ఈ వ్యాక్సిన్‌ను ఈ నెల 12న రిజిస్టర్‌ చేయనున్నారు. ప్రస్తుతం చివరి, మూడోదశ క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయని ఇనిస్టిట్యూట్ ప్రతినిధులు తెలిపారు. వ్యాక్సిన్ సేఫ్టీకి సంబంధించి ఈ కీలక దశ అన్నారు.

వ్యాక్సిన్ సమర్థతను లెక్కించేందుకు జూన్ 17న 76 మంది వాలంటీర్లపై క్లినికల్ ట్రయల్స్ చేశారు. సగం మందికి ఇంజక్షన్, మిగతావారికి పౌడర్ రూపంలో వ్యాక్సిన్ ఇచ్చారు. రెండు విధానాల్లో వ్యాక్సిన్ సక్సెస్ ఫుల్ గా పనిచేసిందని సైంటిస్టులు చెప్పారు.

అయితే రష్యా ప్రకటనపై అమెరికా కాస్త భిన్నంగా స్పందించింది. వ్యాక్సిన్ ను హడావుడిగా తీసుకురావడం సరికాదని అభిప్రాయపడింది. అన్ని రకాలుగా పరీక్షించిన తర్వాతే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని.. లేకపోతే తీవ్రమైన పరిణామాలుంటాయని.. అమెరికన్ నిపుణులు చెబుతున్నారు.

Next Story
Share it