Top
Batukamma

సెప్టెంబర్ 5 నుంచి స్కూల్స్ రీ ఓపెన్..!

సెప్టెంబర్ 5 నుంచి స్కూల్స్ రీ ఓపెన్..!
X
Highlights

కరోనా భయంతో ఆంధ్రప్రదేశ్ లో కూడా స్కూళ్లు మూతపడ్డాయి. కొన్ని ప్రయివేటు స్కూళ్లు ఆన్ లైన్ క్లాసులు చెబుతున్నా.. ...

కరోనా భయంతో ఆంధ్రప్రదేశ్ లో కూడా స్కూళ్లు మూతపడ్డాయి. కొన్ని ప్రయివేటు స్కూళ్లు ఆన్ లైన్ క్లాసులు చెబుతున్నా.. వాటికి అధికారిక ఆమోదం మాత్రం లేదు.

అయితే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం.. స్కూళ్ల రీ ఓపెనింగ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనలను అనుసరించి సెప్టెంబర్ 5 నుంచి స్కూళ్లు రీ ఓపెన్ చేయాలని అనుకుంటున్నట్టు చెప్పారు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.

కరోనాతో స్కూళ్లు మూతపడటంతో.. ఇప్పటికే గోరుముద్ద పథకం కింద విద్యార్థులకు నేరుగా ఇళ్లకే రేషన్ అందజేస్తుమన్నారు. సెప్టెంబర్ 5 వరకు ఇంటికే పంపిణీ చేస్తామన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో విద్యావిధానంలో సమూలంగా మార్పులు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు మంత్రి. బోధన చేస్తూనే.. కాంపిటేటివ్ పరీక్షలకు శిక్షణ ఇస్తామన్నారు.

ap minister suresh

స్కిల్ డెవలప్ మెంట్ పై ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రారంభిస్తున్నామని చెప్పారు.

Next Story
Share it