Top
Batukamma

ఖమ్మంలో మరో హత్రాస్ ఘటన!

ఖమ్మంలో మరో హత్రాస్ ఘటన!
X
Highlights

దిశ లాంటి సంఘటనలు జరిగినప్పటికీ అమ్మాయిల పైన అఘాయిత్యాలు ఏ మాత్రం తగ్గడం లేదు.. మొన్న జరిగిన హత్రాస్ ఘటన కూడా...

దిశ లాంటి సంఘటనలు జరిగినప్పటికీ అమ్మాయిల పైన అఘాయిత్యాలు ఏ మాత్రం తగ్గడం లేదు.. మొన్న జరిగిన హత్రాస్ ఘటన కూడా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.. ఇంకా అలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి...

తాజాగా ఓ 13 ఎళ్ల మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఖమ్మంలో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం నగరంలో ఓ ధనవంతుల ఇంట్లో సదరు బాలిక పనిచేస్తోంది.

అయితే ఆ బాలిక పైన ఇంటి యజమాని కుమారుడు కన్నేసాడు.. ఆమె పై అత్యాచారం చేయబోయాడు. అందకు ఆ బాలిక ఎదురుచేప్పడంతో ఆమె పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.. బాలిక 70 శాతం కాలిన గాయాలతో ప్రస్తుతం ఖమ్మం నగరంలోని వినోదా థియేటర్ సమీపంలో గల ఓ ప్రవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది...

అయితే ఇంతటి దారుణానికి పాల్పడిన యజమాని కుమారుడు బాలికను బెదిరించినట్టుగా తెలుస్తోంది. ఈవిషయం ఎవరికైనా చెబితే బాలిక తో పాటు తల్లిదండ్రులను కూడా చంపుతానని బెదిరించాడని తెలుస్తోంది. దీనిపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

దాదాపుగా ఈ ఘటన జరిగి పది రోజులు దాటింది. అయితే ఈ ఘటన పై రెండు వర్గాలు రెండు భిన్న కథనాలు ప్రచారం చేస్తున్నాయి. మరో దారుణం ఏంటంటే ప్రైవేటు సెలిట్మెంట్ కు, కుల పంచాయితీకి ప్రయత్నించారు. అయితే రాజీ కుదరకపోవడంతో విషయం బయటకు వచ్చింది.

Next Story
Share it