Top
Batukamma

బీజేపీలోకి దిగ్విజయ్ సింగ్ కూతురు.. నిజమేనా..?

బీజేపీలోకి  దిగ్విజయ్ సింగ్ కూతురు.. నిజమేనా..?
X
Highlights

Shreyasi singh Joins Bjp : దిగ్విజయ్ సింగ్ కూతరు బీజేపీలో చేరింది . ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో సంచలన వార్తగా...

Shreyasi singh Joins Bjp : దిగ్విజయ్ సింగ్ కూతరు బీజేపీలో చేరింది . ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో సంచలన వార్తగా మారింది. సోషల్ మీడియాను కుదిపేస్తోంది. దిగ్విజయ్ సింగ్ కూతురు ఏంటీ..? బీజేపీలో చేరడం ఏంటీ..? అనే ప్రశ్నతో బిత్తరపోతున్నారు చాలామంది.

దిగ్విజయ్ సింగ్ అంటే కాంగ్రెస్ లో కీలక నేత. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. సోనియాగాంధీ ఫ్యామిలీకి సన్నిహితుడు. మరి అలాంటి వ్యక్తి కూతురు బీజేపీలోకి వెళ్ళడం ఏంటీ..? అని అంతా ఆశ్చర్యపోతున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ ఇష్యూ ట్రెండింగ్ అవుతోంది. అయితే.. అసలు విషయం మాత్రం వేరే ఉంది.

బీజేపీలో చేరుతున్నది కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ కూతురు కాదు. బిహార్ కు చెందిన కేంద్ర మాజీ మంత్రి దిగ్విజయ్ సింగ్ కూతురు శ్రేయాసి సింగ్. చంద్రశేఖర్, వాజ్ పేయి ప్రధానమంత్రులుగా చేసిన టైంలో వారి కేబినెట్ లలో మంత్రిగా పనిచేశారు ఈ దిగ్విజయ్ సింగ్. మొదట్లో జనతాదళ్ పార్టీలో ఉన్నారు. తర్వాత సమతా పార్టీలో చేరారు. ఆయన కూతురే శ్రేయాసి సింగ్.

https://twitter.com/ndtv/status/1312727073253814272

శ్రేయాసి సింగ్ షూటర్. అర్జున అవార్డు కూడా అందుకుంది. 2018 కామన్వెల్త్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించింది. షూటర్ గా మంచి పేరు సంపాదించింది. ఆమె తల్లి పుతుల్ సింగ్ కూడా ఎంపీగా ఉన్నారు. బీజేపీలో చేరుతున్న శ్రేయాసి సింగ్.. ఈ నెలలో జరగబోయే బిహార్ ఎన్నికల్లో అమర్ పుర్ లేదా జముయ్ నియోజకవర్గాల నుంచి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

Bihar MP Digvijay Singh passes away - The Hindu

అయితే కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ఎక్కువమందికి తెలుసు.. బిహార్ కు చెందిన దిగ్విజయ్ సింగ్ దేశంలో తక్కువ మందికి తెలుసు. దీంతో దిగ్విజయ్ కూతురు బీజేపీలో చేరుతోంది అనే వార్త చూసిన ప్రతీ ఒక్కరు.. నిజంగానే కాంగ్రెస్ నేత దిగ్విజయ్ కూతురేమోనని షాక్ అవుతున్నారు. తర్వాత విషయం తెలుసుకుని కూల్ అవుతున్నారు.

Also Read :

Next Story
Share it