Top
Batukamma

ఆ సినిమాకి చెప్పులు విడిచి ధియేటర్ లోకి వెళ్లారు.. ఏంటి ఆ సినిమా?

ఆ సినిమాకి చెప్పులు విడిచి ధియేటర్ లోకి వెళ్లారు.. ఏంటి ఆ సినిమా?
X
Highlights

నిజానికి అది గుడి కాదు.. వినోదాన్ని అందించే ఓ ధియేటర్.. అందులోని ఆడుతున్న సినిమాని దేవుడిలాగా భావించారు...

నిజానికి అది గుడి కాదు.. వినోదాన్ని అందించే ఓ ధియేటర్.. అందులోని ఆడుతున్న సినిమాని దేవుడిలాగా భావించారు ప్రేక్షకులు.. ఈ సినిమాని చూసేందుకు నిజంగానే ప్రేక్షకులు చెప్పులు విడిచి ధియేటర్ లోకి వెళ్లారు.. బహుశా భారతీయ సినీ చరిత్రలో ఇలాంటి సంఘటన ఎక్కడ జరిగి ఉండకపోవచ్చు.. కానీ విశ్వనాథుని 'శంకరాభరణం' సినిమాకి మాత్రమే ఆ గొప్పతనం దక్కింది.. కానీ ఇదో భక్తీ సినిమానా అంటే లేదు.. కానీ మన ఎందుకు అంతాలా ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు..

1979లో రిలీజ్ అయిన ఈ సినిమా సంగీత ప్రాధాన్యత గల చిత్రంగా తెరకెక్కి ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా ఘనవిజయం సాధించి భారీ విజయాన్ని అందుకొని ఒక సంచలనం సృష్టించింది. 70వ దశకంలో మాస్ మసాలా చిత్రాల వెల్లువలో కొట్టుకుపోతున్న తెలుగు సినిమాకి మేలిమలుపుగా నిలిచింది ఈ శంకరాభరణం.. ఈ సినిమాని చూసి ఏకంగా చాలామంది కర్ణాటక సంగీతం నేర్చుకున్నారంటే ఈ సినిమా వారిలో ఎంతటి ప్రభావాన్ని చూపించిందో అర్ధం చేసుకోవచ్చు..

ఉత్తమ విలువలతో కళలపై ఉన్న మక్కువతో శాస్ర్తియ సంగీతాన్ని, నృత్యాన్ని మేళవించి అద్భుత కథనంతో చిత్రీకరించి అందరిని ఆకట్టుకుంది ఈ శంకరాభరణం.. శంకరశాస్ర్తీ లాంటి ఓ గొప్ప విద్వాంసుడు, ఓ వేశ్య కూతురు తులసిని ఎందుకు ఆదరించాడు. కళలను ఆరాధించే తులసి, శంకరశాస్ర్తీని గురువుగా భావించి ఎలా ఆరాధించింది అనే సున్నితమైన కథాంశంతో సినిమాని చిత్రీకరించారు విశ్వనాథ్‌..

కళాత్మక దృశ్యకావ్యం 'శంకరాభరణం' కి 40 ...

ముందుగా ఈ కథని సినిమాగా తీద్దామని ఎవరికైనా చెబితే కింది నుంచి పైకి చూడడం ఖాయం.. అలాంటిది ఈ కథని సినిమానిగా తీసి మెప్పించి..దాదాపుగా 40 సంవత్సరాలు అయిన గుర్తుపెట్టుకునేలా చేయడం అంటే మామాలుగా విషయం కాదు.. ఇక ఈ సినిమాకి ఎంచుకున్న పాత్రలు పెద్ద సాహసమేనని చెప్పాలి.. ఈ సినిమాని ముందుగా అక్కినేని నాగేశ్వరరావు, శివాజీగణేషన్‌ లాంటి వాళ్ళతో తీయాలని భావించారు విశ్వనాథ్‌.. ఒకానొక టైంలో కృష్ణంరాజును సంప్రదించారు కూడా కానీ ఇమేజ్ దృష్ట్యా అయన ఈ సినిమాని పక్కన పెట్టేశారు.

ఇక ఇమేజ్‌ వున్న నటులైతే పాత్ర హైలైట్‌ కాదని ఫైనల్ గా భావించి జేవీ సోమయాజులును ఎంపిక చేశారు విశ్వనాథ్‌.. ఇక అప్పటివరకూ వ్యాంప్‌ పాత్రలు చేసిన ముంజుభార్గవిని ఎంపిక చేయడం మరో సాహసం అని చెప్పవచ్చు.. అల్లు రామలింగయ్య, చంద్రమోహన్ ఇలా ప్రతి పాత్ర జీవం పోసింది. ఇక వేటూరి అందించిన పాటలు, మహదేవన్ సంగీతం, జంధ్యాల మాటలు సినిమాకి ప్రాణం పోశాయి.. ఇప్పటికి ఎప్పటికి 'శంకరాభరణం' తెలుగు సినీ చరిత్రలో ఒక అద్భుతం.. అఖండం, అమోఘం.

https://www.youtube.com/watch?v=4xrJTAKJotg

Next Story
Share it