Top
Batukamma

30 Years Industry Prudhvi : ఆ రెండు రోజుల షూటింగ్.. పృథ్వీకి ఇంకా అన్నం పెడుతుంది!

30 Years Industry Prudhvi : ఆ రెండు రోజుల షూటింగ్.. పృథ్వీకి ఇంకా అన్నం పెడుతుంది!
X
Highlights

30 Years Industry Prudhvi : సినిమా.. ఇదో రంగుల ప్రపంచం.. ఎప్పుడు ఎవరికీ ఎలా అవకాశాలు వస్తాయో వచ్చిన అవకాశాల్లో ...

30 Years Industry Prudhvi : సినిమా.. ఇదో రంగుల ప్రపంచం.. ఎప్పుడు ఎవరికీ ఎలా అవకాశాలు వస్తాయో వచ్చిన అవకాశాల్లో ఏది మంచి బ్రేక్ ఇస్తుందో ఎవరికీ తెలియదు.. కేవలం సింగిల్ డైలాగ్ తో క్లిక్ అయిన నటులు కూడా ఉన్నారు.. అందులో ఒకడు బలిరెడ్డి పృథ్వీరాజ్.. అలియాస్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ.. పృథ్వీ మంచి కమెడియన్ గా అందరికి బాగా సుపరిచితుడే.. సినిమా ఏదైనా సరే 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్ మాత్రం కామన్.. ఈ ఒక్క డైలాగ్ పృథ్వీరాజ్ కెరీర్ ని మలుపుతిప్పింది.

ఈ డైలాగ్ ఎక్కడిదో అందరికి తెలిసిందే.. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గం సినిమాలోనిది.. 2002 లో విడుదలైన ఈ సినిమా పృథ్వీకి మంచి బ్రేక్ ఇచ్చింది. అయితే ఈ సినిమా కంటే ముందు కృష్ణవంశీ దర్శకత్వంలో సింధూరం అనే సినిమాలో ఒక చిన్న పాత్రని పోషించాడు.. కానీ ఆ తర్వాత అవకాశాలు మాత్రం రాలేదు.. ఆకలితో పస్తులు ఉండాల్సిన పరిస్థితులు వచ్చాయి.

కృష్ణవంశీ ఖడ్గం సినిమా చేస్తున్నాడని తెలిసి ఓ పదిరోజుల క్యారెక్టర్ ఇవ్వు అని అడిగాడట.. ఎందుకంటే షూటింగ్ సమయంలో ఆకలికి ఎలాంటి కొదవ ఉండదు .. ఉన్నని రోజులు సినిమా చేసుకుంటూ ఆకలి తీర్చుకోవచ్చు కదా.. కానీ కృష్ణవంశీ నీకోసం స్పెషల్ గా ఓ క్యారెక్టర్ రాశా.. రెండు రోజుల పాత్ర మాత్రమే కానీ కచ్చితంగా నీ కెరీర్ ని మలుపు తిప్పుతుంది అని చెప్పాడట..

https://www.youtube.com/watch?v=epULERjCldg

అదే 30 ఇయర్స్ ఇండస్ట్రీ పాత్ర.. ఇప్పటికి పృథ్వీ అంటే టక్కున గుర్తొచ్చే పాత్ర కూడా అదే.. అంతలా ప్రేక్షకుల మైండ్ లో రిజిస్టర్ అయిపొయింది ఈ పాత్ర.. " ఓరి మ్లేచ్చుడా" అంటూ ఆయన చెప్పే డైలాగ్ నవ్వులు పూయిస్తుంది. ఈ ఒక్క పాత్ర, ఈ ఒక్క సినిమా పృథ్వీ కెరీర్ ని మలుపు తిప్పింది. మరో 30 ఇయర్స్ వరకు పృథ్వీకి సినిమా అవకాశాలను తెచ్చిపెడుతూ అన్నం పెడుతుంది.

Next Story
Share it