Top
Batukamma

Sushant Singh : సుశాంత్ సింగ్ డెత్ మిస్టరీ టైమ్ లైన్

Sushant Singh : సుశాంత్ సింగ్ డెత్ మిస్టరీ టైమ్ లైన్
X
Highlights

కేసు మొత్తం ఆయన ప్రియురాలు రియా వైపు తిరిగింది. రియా, ఆమె ఫ్యామిలీ.. సుశాంత్ ను చాలా ఇబ్బందులు పెట్టారని ఆరోపణలు వచ్చాయి.

Sushant Singh Rajput Death Case Timeline : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం సినీ పరిశ్రమలో పెద్ద సంచలనంగా మారింది. బాలీవుడ్ లో నెపొటిజం వల్లే సుశాంత చనిపోయాడని విమర్శలు వెల్లువెత్తాయి. సినీ పరిశ్రమ పెద్దలే దీనికి కారణమని అంతా తిట్టిపోశారు.

ఆ తర్వాత కేసు మొత్తం ఆయన ప్రియురాలు రియా వైపు తిరిగింది. రియా, ఆమె ఫ్యామిలీ.. సుశాంత్ ను చాలా ఇబ్బందులు పెట్టారని ఆరోపణలు వచ్చాయి. సుశాంత్ ఫ్యామిలీ కూడా రియాపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అసలు.. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో మొదటి నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది.?

జూన్ 14 : సుశాంత్ సింగ్రాజ్ పుత్ బాంద్రాలోని తన నివాసంలో సూసైడ్ చేసుకుని చనిపోయాడు.

జూన్ 15 : సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అంత్యక్రియలు జరిగాయి.

జూన్ 16 : సుశాంత్ కు న్యాయం జరగాలంటూ ఆందోళనలు మొదలయ్యాయి. ఓ లాయర్ 8 మంది బాలీవుడ్ పెద్దలు, నటులపై కోర్టులో క్రిమినల్ కేసు ఫైల్ చేశాడు. వారిలో సల్మాన్ ఖాన్, కరన్ జోహార్, ఏక్తా కపూర్ ఉన్నారు. జూన్ 18 : సుశాంత్ అస్థికలు.. పాట్నా సమీపంలో గంగానదిలో కలిపేశారు.

జూన్ 18 : అతని గర్ల్ ఫ్రెండ్.. రీయా చక్రవర్తి బాంద్రా స్టేషన్ కు వచ్చి తన స్టేట్ మెంట్ రికార్డ్ చేసింది.

జూన్ 19 : యశ్ రాజ్ ఫిల్మ్స్ నుంచి కాంట్రాక్టుల వివరాలు సేకరించిన పోలీసులు. యశ్ రాజ్ ఫిల్మ్స్ తో రెండు సినిమాలకు సైన్ చేసిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్.

జూన్ 24 : సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పోస్ట్ మార్టం రిపోర్ట్ పోలీసులకు చేరింది. పెనుగులాట గాయాల, ఇతర గాయాలు లేవని తేల్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్. ఉరి వేసుకోవడం వల్లే ప్రాణాలు పోయాయని క్లారిటీ ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్.

జూన్ 30 : సుశాంత్ తో కలిసి దిల్ బెచారా సినిమా చేసిన సంజన సంఘిని ముంబై పోలీసులు ఇంటరాగేట్ చేశారు.

సుశాంత్ ఫ్యామిలీ కూడా పోలీసులను కలిసింది.

జులై6 : సినీ నిర్మాత సంజయ్ లీలాభన్సాలీని ప్రశ్నించిన ముంబై పోలీసులు.

జులై 11 : సల్మాన్ ఖాన్ మాజీ మేనేజర్ రేష్మా శెట్టిని పోలీసులు 5 గంటల పాటు విచారించారు.

జులై 16 : సీబీఐ ఎంక్వైరీ చేయించాలంటూ అమిత్ షాకు ట్యాగ్ చేసి ట్విట్టర్ లో పోస్ట్ చేసిన రియా.

జులై 18 : ఆదిత్య చోప్రాను విచారించిన ముంబై పోలీసులు.

జులై 26 : సీబీఐ ఎంక్వైరీ చేయించాలంటూ లేఖ రాసిన బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి. ట్విట్టర్ లో ప్రధాని మోడీని ట్యాగ్ చేసి ఈ లెటర్ పెట్టారు.

జులై 27 : మహేష్ భట్ స్టేట్ మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు.

జులై 28 : ధర్మ ప్రొడక్షన్స్ సీఈఓ అపూర్వ మిశ్రాను విచారించిన ముంబై పోలీసులు.

జులై 28 : పాట్నాలో పోలీసులకు ఫిర్యాదు చేసిన సుశాంత్ తండ్రి. రియా చక్రవర్తి తన కుమారుడి అకౌంట్ నుంచి 15 కోట్ల తీసుందని, రియా ఫ్యామిలీ కూడా సుశాంత్ లాప్ టాప్, నగదు, నగలు, క్రెడిట్ కార్డులు తీసుకుని బెదిరించారని ఆరోపణలు చేసిన ఫ్యామిలీ.

జులై 29 : ఫొరెన్సిక్ రిపోర్ట్ వచ్చింది.

జులై 29 : సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి. పాట్నాలో ఫైల్ అయిన కేసును ముంబైకి ట్రాన్స్ ఫర్ చేయాలని రియా వినతి.

జులై 31 : ఓ వీడియో రిలీజ్ చేసిన రియా. కొద్ది రోజులుగా సుశాంత్ తో సహజీవనం చేస్తున్నాని చెప్పిన రియా. జూన్ 8న అతడు ఇంటిలోంచి వెళ్లిపోయాడని.. తర్వాత ఆరు రోజులకు అతను చనిపోయాడని చెప్పిండి.

ఆగస్ట 1 : సీబీఐ విచారణ చేయించాలంటూ బిహార్ సీఎం నితీశ్ కుమార్ సిఫార్సు.

ఆగస్ట్ 2 : కనిపించకుండా పోయిన రియా చక్రవర్తి. ఇన్వెస్టిగేషన్ కు సహకరించాలని బిహార్ పోలీసుల నోటీలసులు.

ఆగస్ట్ 3 : రియా చ్రక్రవర్తి ఎక్కడుందో తెలియదన్న ముంబై పోలీసులు.

ఆగస్ట్ 4 : కేసుకు ముంబై పోలీసులు సహకరించడం లేదంటూ పాట్నా పోలీసుల ఆరోపణ. ముఖ్యమైన డాక్యుమెంట్లు ఇవ్వడం లేదని.. 48 పేజీల రిపోర్ట్ తయారు చేసిన బిహార్ పోలీసులు. బ్యాంక్ లావాదేవీలు, వాట్సప్ మెస్సేజ్ లు అన్నీ రిపోర్ట్ లో ప్రస్తావించిన బిహార్ పోలీసులు.

ఆగస్ట్ 5 : సీబీఐకి కేసు అప్పగించాలన్న బిహార్ ప్రభుత్వ విజ్ఞప్తికి అంగీకరించామన్న సొలిసిటర్ జనరల్.

ఆగస్ట్ 6 : సీబీఐ, రియా చక్రవర్తి మరో ఐదుగురిపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినట్టు చెప్పిన సీబీఐ. ఏ1గా రియా పేరును చేర్చారు. 306 ఆత్మహత్యకు ప్రేరేపించడం, 341 అక్రమంగా అడ్డుకోవడం, 342 అక్రమంగా నిర్భందించడం, 380 దొంగతనం, 406 నమ్మించి మోసం చేయడం, 420 మోసం చేయడం, 506 బెదిరింపులకు పాల్పడటం, 120 బీ నేరపూరిత కుట్ర సెక్షన్ల కింద కేసులు.

ఆగస్ట్ 7 : రియా పిటిషన్ లో పార్టీగా ఉండేందుకు అనుమతించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన కేంద్రం.

ఆగస్ట్ 8 : రియా పిటిషన్ కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తండ్రి.

ఆగస్ట్ 10 : మీడియా కథనాలపై మరోసారి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన రియా.

ఆగస్ట్ 11 : బిహార్ పోలీసుల జురిడిక్షన్ కాదని సుప్రీంకోర్టుకు చెప్పిన మహారాష్ట్ర ప్రభుత్వం.

ఆగస్ట్ 19 : పాట్నాలోని ఎఫ్ఐఆర్ ను సీబీఐకి ట్రాన్స్ ఫర్ చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతి.

ఆగస్ట్ 22 : సుశాంత్ సింగ్ ఇంటిలో సీబీఐ ఎంక్వైరీ. సీన్ రీక్రియేషన్ చేసిన సీబీఐ అధికారులు.

Next Story
Share it