Top
Batukamma

TEENMAAR ANCHOR : బిగ్ బాస్ కు మరో "తీన్మార్ యాంకర్"..!

TEENMAAR ANCHOR : బిగ్ బాస్ కు మరో తీన్మార్ యాంకర్..!
X
Highlights

TEENMAAR ANCHOR GOING TO BIGGBOSS HOUSE : తెలుగు ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్న బిగ్ బాస్ సీజన్ 4 త్వరలో ప్రారంభం ...

TEENMAAR ANCHOR GOING TO BIGGBOSS HOUSE : తెలుగు ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్న బిగ్ బాస్ సీజన్ 4 త్వరలో ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తు అంతా పూర్తయింది. రీసెంట్ గా ప్రోమో కూడా రిలీజ్ చేశారు. ఈ సారి కూడా అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు. ప్రోమోలో ముసలివాడి లుక్ లో కనిపించాడు నాగార్జున.

అయితే.. కంటెస్టెంట్లు ఎవరనే దానిపైనా చాలా లీకులు వస్తున్నాయి. పూనమ్ భజ్వా, శ్రద్దాదాస్, హంసా నందిని, సింగర్ సునీత, మంగ్లీ (సింగర్), హీరో నందు (గీతా మాధురి భర్త), వైవా హర్ష, అఖిల్ సార్దక్, యామినీ భాస్కర్, మహాతల్లి, అపూర్వ, పొట్టి నరేష్ ప్రియ వడ్లమాని, సింగర్ నోయల్ పేర్లు చాలా వరకు ప్రచారంలో ఉన్నాయి.

వీరితో పాటు.. హాట్ యాంకర్లు విష్ణుప్రియ, మంజూషలు కూడా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతోంది. వీళ్లే కాదు.. ఇంకా చాలా పేర్లు ప్రచారంలో ఉన్నాయి.

అయితే.. వీరితో పాటు మరో అమ్మాయి కూడా ఈ సారి బిగ్ బాస్ హౌస్ లోకి కాలు పెట్టబోతోందని సమాచారం. తెలంగాణ నుంచి బిగ్ బాస్ సీజన్ 3లో శివజ్యోతి(తీన్మార్ సావిత్రి) హౌస్ లోకి వెళ్లింది. అయితే ఈ సారి తెలంగాణ నుంచి అదే తీన్మార్ వార్తల నుంచి వచ్చిన మరో అమ్మాయి బిగ్ బాస్ కు వెళ్తోందట.

సుజాతగా వీ6 ప్రేక్షకులకు పరిచమైన శృతి.. బిగ్ బాస్ 4 సీజన్ వెళ్తోందని తెలుస్తోంది. ప్రస్తుతం శృతి HMTV లో ప్రసారమయ్యే జోర్దార్ వార్తల్లో యాంకర్ గా చేస్తోంది. గతంలో శివజ్యోతి వెళ్లినట్టుగానే ఇప్పుడు శృతి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది.

ఇప్పటికే సెలక్షన్ ప్రాసెస్, అగ్రిమెంట్ కూడా పూర్తవడంతో.. హౌస్ లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యిందట శృతి. అయితే కరోనా నేపథ్యంలో ఈ సారి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కంటెస్టెంట్ లు అందరు 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలని నిబంధన పెట్టారట. దీంతో ఇప్పటికే కంటెస్టెంట్ లందరు క్వారంటైన్ లోకి వెళ్లినట్టు తెలుస్తోంది.

శృతి అలియాస్ జోర్దార్ సుజాత బిగ్ బాస్ కు వెళ్తుండటంతో.. HM TVలో జోర్దార్ వార్తలకు కొత్త యాంకర్ ను తీసుకొచ్చారు. ఫోక్ సింగర్ అయిన ఓ అమ్మాయిని తీసుకొచ్చి కాస్త ట్రెయినింగ్ ఇచ్చి జోర్దార్ వార్తలు చదివిస్తున్నారు. బిగ్ బాస్ పూర్తయ్యాక సుజాత తిరిగి జోర్దార్ కు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

అయితే.. తెలంగాణ కేటగిరి.. అందులోనూ టీవీ మీడియా నుంచి శృతిని తీసుకుంటున్నారు కాబట్టి.. ఈ సారి మంగ్లీకి ఎంట్రీ ఉండకపోవచ్చనే మాట వినబడుతోంది. అయితే.. దీనిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. అలాగే బిత్తిరి సత్తి కూడా ఈ సారి బిగ్ బాస్ కు వెళ్తున్నాడని ప్రచారం జరిగుతోంది.

అచ్చమైన పల్లెటూరి పిల్లలా.. అల్లరి పిల్లలా.. అచ్చమైన తెలంగాణ యాసలో స్క్రీన్ పై సందడి చేసే శృతిది వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఇప్పరపల్లి. శృతి తండ్రి ఆర్టీసీ డ్రైవర్, తల్లి అంగన్ వాడీ టీచర్. ఇంటిలో శృతినే చిన్నమ్మాయి కావడంతో గారాబంతో పెంచారు.

కంప్యూటర్ కోర్సు నేర్చుకుని ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చిన శృతి తీన్మార్ వార్తలోకి రాకముందే స్క్రీన్ పై మెరిసింది. అలా మొదలైంది, రామసీత సీరియల్స్ లో నటించింది. తర్వాత సినిమాల్లోనూ ఆఫర్లు వచ్చాయి. సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాలోనూ ఓ క్యారెక్టర్ చేసింది.

సినిమాల్లో చేయడానికి ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడంతో.. టీవీ మీడియా వైపు టర్న్ తీసుకుంది. బంధువుల ద్వారా వీ6 న్యూస్ లో ఇంటర్వ్యూకు అటెంట్ అయ్యి యాంకర్ గా జాయిన్ అయ్యింది. వేలాది మంది ఫ్యాన్స్ ను సంపాదించుకుంది.

..

ఇవి కూడా చదవండి :

Next Story
Share it