Top
Batukamma

Telangana Assembly : ఆగమేఘాల మీద అసెంబ్లీ అందుకే..!

Telangana Assembly : ఆగమేఘాల మీద అసెంబ్లీ అందుకే..!
X
Highlights

10 రోజులు నిండా కుండానే వాటిని బంద్ చేశారు. కరోనా పేరు చెప్పి ఇళ్లకు వెళ్లిపోయారు.

Telangana Assembly session on october 13 and 14:తెలంగాణలో ఇటీవలే అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. మొదట 18 రోజుల పాటు నిర్వహించాలని అనుకున్నా.. 10 రోజులు నిండా కుండానే వాటిని బంద్ చేశారు. కరోనా పేరు చెప్పి ఇళ్లకు వెళ్లిపోయారు.

ఇప్పుడు మళ్లీ ఆగమేఘాల మీద అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 13న శాసనసభ, 14న శాసన మండలి సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే.. మొన్ననే ముగిసిన సమావేశాలు.. ఇప్పుడు మళ్లీ ఎందుకు సెషన్ పెడుతున్నారనేది ఆసక్తికరంగా మారింది.

త్వరలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక్కడ మైనారిటీ పాపులేషన్ ఎక్కువ. ఇప్పుడున్న చట్టం ప్రకారం ఎన్నికలు జరిగితే సర్కారుకు తిప్పలు తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం చట్టం ప్రకారం ఇద్దరు పిల్లలుంటేనే పోటీకి అర్హులు.

ఈ నిబంధన అమలైతే చాలా డివిజన్ లలో అభ్యర్థులు దొరకని పరిస్థితి వస్తుంది. అదే జరిగితే.. వంద సీట్లు వస్తాయని బల్లగుద్ది మరీ చెప్పిన కేటీఆర్ కు పరాభవం తప్పదు.

దీనికి తోడు గ్రేటర్ లో డివిజన్ లు కూడా పెంచేందుకు సర్కారు ఆలోచిస్తోంది. కొత్త డివిజన్లు తమకు కలిసి వస్తాయనే ఆలోచనలో ఉంది.

అందుకే గ్రేటర్ ఎన్నికలకు ముందే.. వ్యవస్థ మొత్తం సెట్ రైట్ చేసి పెట్టుకుంటే.. ఎలక్షన్ నాటికి సేఫ్ గా ఉండొచ్చని సర్కారు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇదే ముఖ్యమైన ఎజెండాగా 13న అసెంబ్లీ సమావేశం(Telangana Assembly) ఉదయం 11:30గంటలకు, మండలి సమావేశం 14న ఉదయం 11గంటలకు నిర్వహించాలని నిర్ణయించారు.

13న అసెంబ్లీలో ప్రవేశ పెట్టే బిల్లులను, 14న మండలిలో ప్రవేశ పెడతారు. రెండు చోట్లా బిల్లులు పాసయ్యాక సభను వాయిదా వేస్తారు. ఎలాగూ రెండు సభల్లో మెజార్టీ ఉంది కాబట్టి బిల్లులు సునాయాసంగా పాసవుతాయి.

READ ALSO :

Next Story
Share it