Top
Batukamma

Telangana Coronavirus Update: ఇవ్వాలా తెలంగాణలో ఎన్ని కేసులంటే?

Telangana Coronavirus Update: ఇవ్వాలా తెలంగాణలో ఎన్ని కేసులంటే?
X
Highlights

Telangana Coronavirus Update: తెలంగాణలో గత కొద్దిరోజులుగా కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా...

Telangana Coronavirus Update: తెలంగాణలో గత కొద్దిరోజులుగా కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో బుధవారం(5వ తేదీన) రాష్ట్ర వ్యాప్తంగా 2,092 కరోనా కేసులు నమోదు అయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 73,050కి చేరుకుంది.

ఇక నిన్న ఒక్కరోజే కరోనాతో 13 మంది మృతి చెందారు. దీనితో అటు మృతుల సంఖ్య 589 చేరుకుంది. ఇక నిన్న కరోనా నుంచి కోలుకొని 1,289 మంది డిశ్ఛార్జి అయ్యారు. దీనితో డిశ్ఛార్జి అయిన వారి సంఖ్య 52,103కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 20,358 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ఇక నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 21,346 కరోనా పరీక్షలు నిర్వహించగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో టెస్టుల సంఖ్య 5,43,489కి చేరుకుంది. నిన్న నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 535 కేసులు రాగా, రంగారెడ్డి జిల్లాలో 169, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో 126, కరీంనగర్‌ జిల్లాలో 123, వరంగల్‌ అర్బన్‌లో 128, సంగారెడ్డి జిల్లాలో 101 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయినట్టుగా వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.

Next Story
Share it