Top
Batukamma

Telangana New secretariat : కొత్త సెక్రటేరియట్ పనులు అక్టోబర్ లో..!

Telangana New secretariat : కొత్త సెక్రటేరియట్ పనులు అక్టోబర్ లో..!
X
Highlights

Telangana New secretariat construction Starts in october : తెలంగాణ కొత్త సెక్రటేరియట్ పనులు ఇక...

Telangana New secretariat construction Starts in october : తెలంగాణ కొత్త సెక్రటేరియట్ పనులు ఇక జోరందుకోనున్నాయి. ఇప్పటికే పాత భవనాలన్నింటిని కూల్చేశారు. శిథిలాల తరలింపు కూడా దాదాపు చివరి దశకు చేరుకుంది. మరికొద్ది రోజుల్లో ఆ ప్రాంతమంతా క్లీన్ చేయనున్నారు.

మరోవైపు.. కొత్త సెక్రటేరియట్ ఎలా ఉండాలనే ప్లాన్ పైనా క్లారిటీ వచ్చింది. దీంతో నిర్మాణ పనులు మొదలుపెట్టేందుకు రెడీ అయ్యారు. అక్టోబర్ లో పనులు ప్రారంభిచాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అయితే.. శిథిలాలు తొలగించాక నిర్మాణ పనులు మొదలు పెట్టాలంటే ఆ ప్రాంతాన్ని చదును చేయాల్సి ఉంటుంది. దీనికోసం కాస్త సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.

అందుకే అక్టోబర్ లో నిర్మాణం మొదలుపెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు.ఈ గ్యాప్ లో నిర్మాణ అనుమతులు, కాంట్రాక్టులు కూడా ఫైనల్ చేయనున్నారు.

600 అడుగుల పొడవు, 300 అడుగుల వెడల్పుతో సెక్రటేరియట్ నిర్మాణం జరగనుంది. సుమారు రూ. 400 కోట్ల వరకు ఖర్చు కావచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. మొత్తం 7 లక్షల చదరపు అడుగుల్లో కొత్త సెక్రటేరియట్ నిర్మించాలని తుదినిర్ణయం తీసుకున్నారు.

Next Story
Share it