Top
Batukamma

కేకు పైన మత్తుమందు.. పార్టీ అని చెప్పి పాడు చేశారు!

కేకు పైన మత్తుమందు.. పార్టీ అని చెప్పి పాడు చేశారు!
X
Highlights

ఈ క్రమంలో జోసెఫ్‌ యువతికి ఫోన్‌ చేసి ఆ రోజు తన పుట్టినరోజని, నవీన్‌, రాములుతో కలిసి పార్టీ చేసుకోవాలని అనుకుంటున్నానని దానికి నువ్వు తప్పకుండా రావాలని కోరాడు

దిశా, హత్రాస్ లాంటి సంఘటనలు జరిగిన తర్వాత కూడా అమ్మాయిల పైన అఘాయిత్యాలు ఏ మాత్రం తగ్గడం లేదు.. తాజాగా హైదరాబాదులో నమ్మించి ఓ అమ్మాయిని పాడు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈ సంఘటన హైదరాబాదులో చోటు చేసుకుంది.

జూబ్లీహిల్స్‌లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న ఓ యువతి(19) హైదరాబాదులోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. ఆ పరిసర ప్రాంతాల్లో ఉండే జోసెఫ్‌, నవీన్‌రెడ్డి, రాములుతో ఆమెకి పరిచయం ఏర్పడింది. అయితే ఈ నెల5 న సదరు యువతి కాలేజీలో ఫీజు కట్టేందుకు వెళ్ళింది.

ఈ క్రమంలో జోసెఫ్‌ యువతికి ఫోన్‌ చేసి ఆ రోజు తన పుట్టినరోజని, నవీన్‌, రాములుతో కలిసి పార్టీ చేసుకోవాలని అనుకుంటున్నానని దానికి నువ్వు తప్పకుండా రావాలని కోరాడు. ఫ్రెండ్స్ కదా అని గుడ్డిగా నమ్మేసి ఒకే అని చెప్పేసింది. కాలేజీలో ఫీజు కట్టి కాలేజీ నుంచే జోసెఫ్‌, నవీన్‌రెడ్డి, రాములుతో కలిసి వెళ్ళింది.


ఆ తర్వాత బిర్యాని పార్శిల్‌ తీసుకొని తిని కొద్ది సేపు ట్యాంక్‌బండ్‌ బుద్ధ విగ్రహం చుట్టూ తిరిగి కాలక్షేపం చేశారు. దీనితో ఓ నమ్మకం రావడంతో ఆమెను లాడ్జీలోకి తీసుకువెళ్ళి అక్కడ కేకు తీసుకున్నారు. ముందు ప్లాన్ ప్రకారం దానిపైన మత్తుమందు చల్లారు.

ఆ కేకును కట్ చేసి అందరం కలిసి తిందామని యువతి చెపితే దానికి ముందు నువ్వే తినాలంటూ జోసెఫ్‌ ఆమెకు తినిపించాడు. దీనితో ఆమె మత్తులోకి జారుకున్నక ముగ్గురు కలిసి ఆమె పైన అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరించి ఆమెను ఆటోలో ఇంటికి పంపించేశారు.

అయితే కొన్ని రోజులకి యువతి ఆరోగ్యం బాలేకపోవడంతో ఈనెల 11న ఆమెను ఆమె తల్లిదండ్రులు ఆసుపత్రిలో చేర్పించారు. దీనితో అసలు విషయం అక్కడ బయట పడింది. దీనితో యువతి తల్లిదండ్రులు జూబ్లీహిల్స్‌ పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.

Next Story
Share it