Top
Batukamma

A day with naxalite: నక్సలైట్ తో ఒక రోజు (ఎపిసోడ్-2)

A day with naxalite: నక్సలైట్ తో ఒక రోజు (ఎపిసోడ్-2)
X
Highlights

ఎన్‌కౌంటర్‌ అంటే ఏమిటో తెలుసా శీను.. నక్సల్స్‌`పోలీసులు ఎదురుపడ్డప్పుడు జరిగే కాల్పులను ఎన్‌కౌంటర్‌ అంటారు.. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులకు డైరెక్ట్ గా ఎవరిని కాల్చీ చంపే అనుమతి లేదు..

యాటకర్ల మల్లేష్, సీనియర్ జర్నలిస్ట్

కోవర్టులను హత్య చేసిన నక్సల్స్‌ కోసం అడవిలో జల్లెడ పడుతున్నారు పోలీసులు..

నక్సలైట్‌ ఆజాద్‌ ఇంటర్వ్యూకు వెళ్లడం ప్రమాదమని తెలిసినా.. వెళ్లక తప్పడం లేదు.

అడవులలో నక్సల్స్‌ కోసం గాలిస్తున్న పోలీసులకు మేము కనబడితే కాల్పులు జరుపడం ఖాయం..

అదే జరిగితే మేమందరం చెట్టు కొక్కరం.. గుట్టకొక్కరం శవాలుగా పడి ఉంటాము..

రాష్ట్ర వ్యావ్తంగా ఈ సంఘటన సంచనం సృష్టిస్తోంది..

రెండు.. మూడు రోజులు ఇవే ప్రధాన వార్తలు.. ఆ తరువాత అందరూ మరిచి పోతారు..

జర్నలిస్ట్‌ ఉద్యోగం ఎంత డేంజరో.. సాధారణ ప్రజలకు తెలియదు..

ఇప్పుడున్న పరిస్థితులు చాలా ప్రమాదం..

నిజామాబాద్‌ - కరీంనగర్‌ జిల్లా సరిహద్దులో కమ్మర్‌పల్లి మండలం కోనాపూర్‌ అడవులలో

కోవర్టులను గుర్తించిన నక్సల్స్‌ వారిని హత్య చేసి వారం రోజులు కూడా గడువలేదు.

పదకొండుగురు కోవర్టులను గుర్తించి ఒకేసారి హత్య చేయడం సంచనం సృష్టించింది.

మా వెహికిల్‌ గంట తరువాత కరీంనగర్‌ జిల్లా మెట్‌పల్లి మండలం ఆత్మకూర్‌ గ్రామం చేరింది.

అక్కడే కోరియర్‌ కోసం నిరీక్షణ.. ఒకటి.. రెండు గంటలు గడిసాయి.. ఆ కొరియర్‌ జాడలేదు..

ఇంతకు ఆజాద్‌ ఇంటార్వ్యూకు వెళుతామో.. తిరిగి ఇంటికి వెళుతామో అనిపించింది.

'' నల్గొండ జిల్లాలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. అందులో ఎనిమిది గురు నక్సల్స్‌ మరణించారు.. పోలీసులకు మాత్రం ఏమి కాలేదు..'' టీవీ వార్తలు చూసి వచ్చిన జర్నలిస్టు మితృడు సాతేపూతే శ్రీనివాస్‌, మోహన్ చెప్పారు.

'' ఎన్‌కౌంటర్‌ అంటే ఏమిటో తెలుసా శీను.. నక్సల్స్‌`పోలీసులు ఎదురుపడ్డప్పుడు జరిగే కాల్పులను ఎన్‌కౌంటర్‌ అంటారు.. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులకు డైరెక్ట్ గా ఎవరిని కాల్చీ చంపే అనుమతి లేదు.. కానీ.. ఇది పేరుకే ప్రజాస్వామ్యం... పోలీసులకు స్వేచ్ఛ ఇచ్చి నక్సల్స్ ను హత్య చేయిస్తుంది ఈ బూర్జువ ప్రభుత్వం.. తప్పు చేసిన వ్యక్తిని అరెస్టు చేసి ఇరువై నాలుగు గంటలలో కోర్టులో హాజరు పరుచాలి.. కోర్టు సాక్ష్యాలను పరిశీలించి తప్పు చేసినట్లు తేలితే శిక్షిస్తోంది.. ముందుగా నక్సల్స్ ను లొంగి పొమ్మని హెచ్చరిస్తే.. వారు లొంగి పోకుండా కాల్పులు జరిపారు.. ఆత్మరక్షణ కోసం తాము జరిపిన కాల్పులలో నక్సల్స్‌ మృతి చెందారని కేసు నమోదు చేసి చేతులు దుపుకుంటారు పోలీసులు.. ఎన్‌కౌంటర్‌లో నక్సలైట్‌ మరణించిన హత్య నేరం కింద కేసు నమోదు చేయాలని కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించడం లేదు మన పోలీసులు.. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రాసించిన రాజ్యాంగం చాలా గొప్పది.. కానీ.. భారతదేశంలో ఆ చట్టాలు కాగితాలకే పరిమితమవుతున్నాయి..

గుత్ప ఉన్నోడిదే గుర్రం.. డబ్బున్నోడిదే రాజ్యం.. అన్నట్లుగా ఆ చట్టాలను అమలు చేయడంలోనే అవినీతి.. అన్యాయం.. పక్షపతం.. వీటి వల్లనే సామాన్యుడికి న్యాయం జరుగడం లేదు.. కమ్యూనిష్టులు కోరుకుంటున్నట్లుగా అందరు సమానత్వంతో బతికితే... ఈ నక్సల్స్‌ ఉద్యమాలు ఉండవు.'' అన్నాను.

''అవినీతి.. అన్యాయం.. దోపీడిలాంటి పదాలే రాజ్యమేలుతున్నాయి.. జర్నలిజంలో కూడా రాను రాను నైతిక విలువలు కనుమరుగవుతున్నాయి.'' అన్నాడు ''వార్త'' బ్యూరో చీఫ్‌ విపిఎస్‌ రాజు..

''అన్నా.. ఆ కొరియర్‌ వస్తాడంటావా..? ఒకవేళ అతను రాక పోతే మనం తిరిగి పోవాల్సిందెనా..?'' అడిగాడు విజయ్‌ ప్రతాప్‌ చావ్లా.

''నక్సల్స్ ను కలవడామంటే అంతా ఈజీగా ఉండదు.. అయినా.. చీకటి పడగానే కోరియర్‌ తప్పకుండా వస్తాడు.'' అన్నాను.

పొద్దంతా వ్యవసాయ తోటలో పని చేసిన రైతులు ఎడ్ల బండిపై ఊళ్లోకి వస్తున్నారు.

అక్కడక్కడా రోడ్లపై కనబడిన విలేకరులను అనుమానంగా చూస్తున్నారు వారంతా..

తెలంగాణ ప్రాంతంలో నక్సల్స్‌`పోలీసుల మధ్య పరస్పరం కాల్పులు జరుగుతునే ఉంటాయి.

చట్టాన్ని రక్షిస్తున్నామని పోలీసులు.. దోపీడి లేని వ్యవస్థ కోసం పోరాడుతున్నామని నక్సల్స్‌..

వీరి తుపాకి గుళ్లకు బలయ్యేది మాత్రం పేద ప్రజలే..

సమాజంలో ఎంత విచిత్రం...?

ఐదు శాతం ఉన్న అగ్రవర్ణాలు గద్దెనెక్కి పరిపాలన చేస్తున్నారు..

మెజార్టీ ప్రజలు చేసిన శ్రమకు గిట్టుబాటు రాక అన్యాయానికి గురవుతున్నారు..

నక్సల్స్‌ కోరుకునే సోషలిజం రాజ్యం వస్తే ప్రజలు సమానత్వంతో బతుకుతారనిపించింది.

ఆ సమయంలో మా వద్దకు వచ్చిన ఓ యువకుడు పిడికిలి పైకి ఎత్తి '' లాల్‌ సలాం అన్నా..'' అప్యాయతతో పలుకరించాడు కొరియర్‌.

ఆ కొరియర్‌తో పాటు మమ్మల్ని వెహికిల్‌లో తీసుకుని వచ్చిన యువకుడు ఉన్నాడు.

ఆ కొరియర్‌ కలువగానే నక్సలైట్‌ ఆజాద్‌ను ఇంటార్య్వూ చేస్తామనే సంతోషంతో ఉన్నారు విలేకరులు.

'' చీకటైతుంది. అన్నం తిందాం.. ఆజాద్‌ అన్నను కలువడానికి కొంత నడువాల్సి ఉంటుంది. '' అన్నాడు కొరియర్‌.. చెరిగిన జుట్టు.. మాసిన బట్టలు.. బక్క పలుచగా కనిపిస్తున్న అతను యాక్టివ్‌గా కనిపిస్తున్నాడు.

అతను ముందు నడుస్తుంటే అతనిని అనుసరించాము.

ఓ పూరింటిలో బోజనం ఏర్పాటు చేసాడు ఆ కొరియర్‌..

నక్సల్స్‌ అంటే గ్రామీణ ప్రజలకు చాలా ప్రేమ..

ఒకప్పుడు పల్లెలలో పేద ప్రజలతో వెట్టిచాకిరీ చేయించుకున్న భూస్వామును.. దొరలను ప్రజాకోర్టులో శిక్షించారు నక్సల్స్‌..

ప్రభుత్వం నక్సల్స్‌ కార్యకలపాలను అరికట్టడానికి ఎంత ప్రయత్నించినా.. ప్రజలు మాత్రం కంటికి రెప్పలా నక్సల్‌్్ను రక్షించుకుంటారు.. సమయానికి భోజనం పెడుతారు.

నక్సల్స్ కు బోజనం పెట్టినట్లు పోలీసులకు తెలిస్తే అరెస్టు చేసి అక్రమంగా కేసు పెడుతారని తెలిసినా.. నక్సల్స్ కు సహాకరం అందిస్తుంటారు పేద ప్రజలు..

బోజనాలు చేసిన తరువాత..

'' లైన్‌గా నా వెంట రండన్నా.. '' అన్నాడు కొరియర్‌ అడవి వైపు నడుస్తూ..

వర్షం నీళ్లతో బురదగా మారిన గుంత రోడ్‌పై నడుస్తున్నాము మేమంతా..

ఆ చిన్న రోడ్‌కు ఇరు వైపు ముళ్ల కంచె ఉంది..

కొంత దూరంలో కనిపించే పెద్ద పెద్ద చెట్ల కొమ్మలు వీస్తున్న గాలికి కదులుతున్నాయి.

ఆ చీకటిలో ఏమి కనబడటం లేదు..

ఆ బురద రోడ్‌లో నడుస్తుంటే కాలు పైకి లేవడం లేదు.

కొంత దూరం వెళ్లగానే వరి పొలం ఒడ్డుపై నుంచి నడువడం ప్రారంభించాము.

ముందు కొరియర్‌ నుడస్తుంటే.. అతని వెనుక మేము నడువడానికి కష్ట పడుతున్నాము.

అరగంట నడిచిన తరువాత దూరన చీకటిని చీల్చుకుంటూ వీధి దీపాలు వెలుగు కనిపించింది.

'' మల్లేష్‌ భాయి.. బహుశా అక్కడే నక్సల్స్‌ ఉండొచ్చు..'' విని వినపడనట్లుగా అన్నాడు మ్యాకల నరేందర్‌.

'' రాత్రి వేళ మాట్లాడే మాటలు చాలా దూరం వినిపిస్తోంది. పొరపాటున శతృవు విని మనలను ఫాలో అయితే.. చాలా నష్టం జరుగుతాది. ఫ్లీజ్‌ మాట్లాడకుండా నా వెంట రండి. '' కొరియర్‌ అలార్టు చేశాడు.

ఆ గిరిజన తాండా పక్క నుంచి అడవిలో నడుస్తున్నాము. దూరం నుంచి మమ్మలిని పసి కట్టాయెమో

కుక్కలు భౌ.. భౌమని అరుస్తున్నాయి. గుడ్డి దీపంలా వెలుగుతున్న వీధి దీపాల వెలుగులో గుడిచె ముందు కట్టెసిన ఆవులున్నాయి. దట్టమైన అడవిలో గంట నడిసిన తరువాత ఎక్కడ చూసిన పెద్ద వృక్షలే చీకట్లో కనిపించి కనిపించనట్లుగా గాలికి ఊగుతున్నాయి.

ఈ అడవిలో పోలీసులు ఎదురు పడితే మమ్మలిని నక్సల్స్ గా భావించి క్షణం ఆలస్యం చేయకుండా ధన్‌.. ధన్‌ మని కాల్చి వేస్తారు. ఆ చీకట్లో మేము విలేకరులం అంటే పోలీసులు నమ్మలేరనుకున్నాను. తెల్లారి దిన

పత్రికలో '' నక్సల్స్‌`పోలీసుల మధ్యన జరిగిన ఎదురు కాల్సులలో ఎనిమిది గురు విలేకరులు మృతి..''

కథనాలు మెయిన్‌ పేజీలో వస్తాయనిపించింది.

ఆ చీకటిలో పోలీసులు కాల్చీ వేస్తే ప్రాణాలు పోతాయి..

వారం రోజులు జర్నలిస్టు యూనియన్‌ హడావుడి.. అటు తరువాత అందరూ మరిచి పోతారు.

ప్రాణామంటే ప్రపంచంలోని ప్రతి జీవికి ప్రేమనే..

కోట్ల రూపాయలున్నా.. కొనలేని ఆ విలువైన ప్రాణాన్ని గడ్డి పోచలా భావిస్తున్నారు నక్సల్స్‌..

నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం అడవులలో ఉంటూ సాయుధ పోరాటాలు చేస్తున్నారు వారు.

ప్రతి క్షణం శతృవు కళ్లు కప్పి కార్యకపాలు నిర్వహిస్తున్నారు ఆ నక్సల్స్‌..

నక్సలైట్లు నిజమైన హీరోలు..

అవినీతి పాలకులు, అక్రమంగా డబ్బు సంపాదించే అధికారులు మాత్రం దోపిడీ దొంగలే అనిపించింది.

ప్రజాసేవా పేరిట ప్రజలను దోపీడి చేస్తోంది పాలకులు.. ప్రభుత్వ ఉద్యోగులే..

దోపీడి లేని సోషలిజం రాజ్యం కోసం పోరాటాలు చేస్తోంది నక్సల్స్‌..

నమ్మిన సిద్ధాంతాల కోసం కన్న తల్లిదండ్రులను వదిలి పోరు బాట పట్టారు నక్సల్స్‌..

వారికి వ్యక్తిగత జీవితం లేదు.

ఆ నక్సలైట్లను ఏ తల్లిదండ్రులు కన్నారో.. ఎక్కడి నుంచి వచ్చారో...?

నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం.. దోపీడి లేని వ్యవస్థ కోసం.. సాయుధ పోరాటానికి ప్రజలను సంఘటితం చేస్తున్నారు నక్సలైట్లు..

పోలీసు ఎదురు పడితే.. చంపడమో.. చావడమో తెలిసి కూడా అడవిలో కష్టాలు అనుభవిస్తూ ఉద్యమాలు చేస్తున్నారు వారు.. శతృవుతో పోరాడుతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు చాలా మంది నక్సల్స్‌..

నా ఆలోచలనకు భంగం కలిగిస్తూ కొరియర్‌ టార్చ్ లైట్‌తో నేలపై వెతుకుతున్నాడు.. అతని వద్ద ఉన్న తుపాకి తూట చీకట్లో పడిపోయింది.

ఆ తూట క్రిష్ణ(సిటికేబుల్‌)కు కనిపించింది. ఆ తూటను తీసి కోరియర్‌కు అంద చేసాడు అతను. ఆ కొరియర్‌ సంతోషంతో క్రిష్ణకు కృతజ్ఞతలు తెలిపాడు.

ఇంటార్వ్యూకు తీసుకెళ్లడానికి మాతో నడుస్తున్న ఆ కొరియర్‌ వద్ద షార్ట్‌ గన్‌ ఉందని మాకు తెలియదు.

షర్టు కింద బొడ్లో పెట్టుకోవడంతో ఆ గన్‌ కనిపించలేదు. ఊరు బయటకు రాగానే చీకట్లో ఆ గన్‌ను బొడ్లొ నుంచి బయటకు తీసినట్లున్నాడు కొరియర్‌.

నడిచి నడిచి కాళ్లు నొప్పు పెడుతున్నాయి..

చేతికి ఉన్న గడియారం చూసాను రాత్రి పన్నెండు గంటలు.. అంటే.. మూడు గంటలుగా నడుస్తునే ఉన్నాం.

ఎత్తైన గుట్ట దగ్గర కొరియర్‌ జంతువులా అరిసాడు.. రెప్పపాటులో ఏదో శబ్దం వినిపించింది.

ఆ చీకటిలో పొదల మధ్య నుంచి నడిచి వస్తున్న ఆకారం కనిపించింది.

(సశేషం..)

Next Story
Share it