Top
Batukamma

హైదరాబాద్ లో మరో దారుణం.. పట్టపగలే కిడ్నాప్!

హైదరాబాద్ లో మరో దారుణం.. పట్టపగలే కిడ్నాప్!
X
Highlights

అదే క్లినిక్ లో పనిచేసే సయ్యద్‌ సల్మాన్‌ను తీవ్రంగా కొట్టి నోటికి ప్లాస్టర్‌ వేశారు. ఆ తర్వాత హుస్సేన్‌ను కూడా కొట్టి ఈడ్చుకుంటూ తమ కారు వద్దకి తీసుకువెళ్ళారు. బలవంతంగా అందులో ఎక్కించుకుని అక్కడినుంచి వెళ్ళిపోయారు.

హైదరాబాద్‌ లో వరుస కిడ్నాప్ లు కలకలం రేపుతున్నాయి. తాజాగా శామిర్ పేట ఘటన మరిచిపోకముందే హైదరాబాద్ లో మరో కిడ్నాప్ సంఘటన చోటుచేసుకుంది. నిన్న (మంగళవారం) పట్టపగలే ఓ డాక్టర్ ని బురఖాలు ధరించిన గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. స్థానికంగా ఈ ఘటన కలకలం సృష్టించింది.

ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈ ఘటన రాజేంద్రనగర్‌ పరిధిలోని బండ్లగూడ జాగీర్‌లో చోటుచేసుకుంది. స్థానికంగా అక్కడ నివాసం ఉండే దంత వైద్యుడు బెహజత్‌ హుస్సేన్‌ (57) మరో చోట ఓ క్లినిక్‌ నిర్వహిస్తున్నాడు. అయితే ఎప్పటిలాగే రోగులను చూసిన తర్వాత భోజనం కోసం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఇంటికి వెళ్తుండగా కొందరు దుండగులు బురఖాలు ధరించి క్లినిక్‌ లోపలికి వచ్చి గొడవ చేశారు.

అదే క్లినిక్ లో పనిచేసే సయ్యద్‌ సల్మాన్‌ను తీవ్రంగా కొట్టి నోటికి ప్లాస్టర్‌ వేశారు. ఆ తర్వాత హుస్సేన్‌ను కూడా కొట్టి ఈడ్చుకుంటూ తమ కారు వద్దకి తీసుకువెళ్ళారు. బలవంతంగా అందులో ఎక్కించుకుని అక్కడినుంచి వెళ్ళిపోయారు.

అయితే వారు కట్టిన తాళ్లను వదిలించుకొని తన ఇంటికి ఫోన్ చేసి విషయం హుస్సేన్‌ చెప్పడంతో హుస్సేన్‌ భార్య పొలిసులకి ఫిర్యాదు చేసింది. దీనితో సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసును దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే ఆస్తి తగాదాలు ఏమైనా కారణం అయి ఉంటాయా అని పోలీసులు అనుమానిస్తున్నారు. అటు ఇప్పటివరకు కేసులో ఎలాంటి పురోగతి లభించలేదు.

Next Story
Share it