Top
Batukamma

ఆట మొదలెట్టిన రాములమ్మ.. గెలిచేదెవరు..? నిలిచేదెవరు..?

ఆట మొదలెట్టిన రాములమ్మ.. గెలిచేదెవరు..? నిలిచేదెవరు..?
X
Highlights

కాంగ్రెస్ లో ఉన్నా.. విజయశాంతి ఎక్కడా కనిపించడం లేదు. దుబ్బాక ఎన్నికల బాధ్యతను కాంగ్రెస్ పార్టీ ఆమెకే ఇస్తుందనే ప్రచారం జరిగింది.

ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో విజయశాంతి చర్చనీయాంశంగా మారారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న విజయశాంతి తన కామెంట్స్ తో రాజకీయాల్లో హీటు పుట్టిస్తున్నారు.

సొంత పార్టీపైనే విమర్శలు చేస్తుండటం ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్నా.. విజయశాంతి ఎక్కడా కనిపించడం లేదు. దుబ్బాక ఎన్నికల బాధ్యతను కాంగ్రెస్ పార్టీ ఆమెకే ఇస్తుందనే ప్రచారం జరిగింది.

కానీ కాంగ్రెస్ ఆ పని చేయలేదు. కనీసం దుబ్బాకలో ప్రచారానికైనా విజయశాంతి వస్తారని అంతా అనుకున్నారు కానీ అక్కడ కూడా కనిపించలేదు.

ఇదే టైంలో విజయశాంతి పార్టీ మారుతున్నారనే వార్తలు వచ్చాయి. స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి విజయశాంతి ఇంటికెళ్లి మంతనాలు జరిపారనే ప్రచారం జరిగింది. అంతేకాదు.. అప్పటి నుంచి ఇప్పటి వరకు దఫ దఫాలుగా విజయశాంతి, బీజేపీ ముఖ్యనేతల మధ్య చర్చలు జరుగుతున్నాయని సమాచారం.

ఈ క్రమంలో కొందరు కాంగ్రెస్ నేతలు లీకులిస్తూ.. తనపై వ్యతిరేక వార్తలు వచ్చేలా చేస్తున్నారంటూ ఫేస్ బుక్ లో పెట్టారు విజయశాంతి.

కొద్ది రోజుల వ్యవధిలోనే ఇప్పుడు ఫేస్ బుక్ లో ఆమె మరో పోస్ట్ పెట్టారు. ఇదీ మరీ హాట్ టాపిక్ అయిపోయింది.

"ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారన్న సామెత సీఎం కేసీఆర్ గారికి సరిగ్గా వర్తించే సమయం సమీపించింది. కాంగ్రెస్ నేతలు కొందరిని ప్రలోభపెట్టి... ఇంకొందరిని భయపెట్టి... ఒత్తిళ్ళతో ఎమ్మెల్యేలను పార్టీ మార్పించారు. కాంగ్రెస్‌ను బలహీనపరిచే ప్రక్రియ వల్ల ఇప్పుడు మరో జాతీయ పార్టీ బీజేపీ తెలంగాణలో సవాలు విసిరే స్థాయికి వచ్చింది. మరికొంత ముందుగానే మాణిక్యం టాగోర్ గారు రాష్ట్రానికి వచ్చి ఉంటే పరిస్థితులు మెరుగ్గా ఉండేవి కావచ్చు. ఇప్పుడిక కాలము, ప్రజలే నిర్ణయించాలి."

ఇది విజయశాంతి ఫేస్ బుక్ పోస్ట్ లో పెట్టిన విషయం. అయితే.. కాంగ్రెస్ పార్టీలో ఉండి బీజేపీ బలపడిందంటూ విజయశాంతి కామెంట్స్ చేయడంపై ఆ పార్టీ నేతల్లో చర్చ మొదలైంది.

అయితే.. బీజేపీలో చేరేందుకు పూర్తిగా గ్రౌండ్ సెట్ చేసుకున్నాకే విజయశాంతి ఇలాంటి పోస్టు పెట్టారనే ప్రచారం జరుగుతోంది.

త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో రాములమ్మ స్టార్డంను ఈ ఎన్నికల్లో వాడుకునేందుకు బీజేపీ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆమె చర్చలు జరిపారని సమాచారం. గ్రేటర్ ఎన్నికల తేదీలు ప్రకటించే లోగానే.. రాములమ్మ కాషాయ కండువా కప్పేసుకుంటారనే ప్రచారం జరుగుతోంది.

అయితే.. విజయశాంతి మాత్రం.. అన్నీ నర్మగర్భంగానే చెబుతున్నారు. ఎక్కడా బయటపడకుండా.. కాంగ్రెస్ పై తన కోపాన్ని మాత్రం వెళ్లగక్కుతున్నారు. అయితే.. రాష్ట్రంలో బీజేపీ బలపడిందనే మాట.. రాములమ్మ నుంచి రావడంతో.. హస్తానికి హ్యాండివ్వడం ఖాయమనే మాట వినిపిస్తోంది.

- జో బైడెన్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?

- కమలా హ్యారిస్ గురించి ఈ 10 ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుసా?

Next Story
Share it