రఘునందన్ రావు మోసం చేశాడు.. దీక్షకు దిగిన కార్యకర్త!

ఏ పార్టీ కైనా కార్యకర్తలే బలం, పార్టీకి నాయకులు బలం అయితే, నాయకులకి కార్యకర్తలు బలం. నామినేషన్ నుంచి గెలిస్తే సంబరాల వరకు కార్యకర్తలదే హడావిడి ఉంటుంది.
ఏ పార్టీ కైనా కార్యకర్తలే బలం, పార్టీకి నాయకులు బలం అయితే, నాయకులకి కార్యకర్తలు బలం. నామినేషన్ నుంచి గెలిస్తే సంబరాల వరకు కార్యకర్తలదే హడావిడి ఉంటుంది. మరి అలాంటి కార్యకర్తలకి లీడర్లు ఎలాంటి మర్యాద ఇస్తున్నారు.
తాజాగా దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు స్వల్ప మెజారిటీతో గెలిచాడు. అయితే రఘునందన్ రావు గెలుపుకి తానెంతో కష్టపడ్డానని అయితే గెలిచిన తరవాత మాత్రం రఘునందన్‌రావు తనను గుర్తించడం లేదంటూ ఓ కార్యకర్త తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డికి చెందిన ధర్మారం నరహరి బీజేపీ కార్యకర్త. దుబ్బాక ఉప ఎన్నికకోసం నియోజకవర్గమంతా సొంతంగా బైక్‌లో పెట్రోల్ పోసుకొని ఊరూరంతా ప్రచారం చేసినట్టుగా వెల్లడించాడు. ఆ సమయంలో రఘునందన్ రావు తనని ఎంతో పేరు పెట్టి పిలిచేవాడని కానీ ఎమ్మెల్యే అయ్యాక పూర్తిగా మారిపోయినట్టుగా వాపోయాడు.
ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత రఘునందన్‌రావు దగ్గరికి వెళ్తే తనను ఇప్పుడు గుర్తుపట్టనట్టుగా వ్యవహరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక ఫోన్ చేస్తే కూడా ఏ మాత్రం స్పందించడం లేదని, ఒక్కోసారి లిగ్ట్ చేసినప్పటికీ .'నీ వెవరు?, నీ పేరేమిటి?' అని అడుగుతున్నాడని దీనితో మనస్తాపానికి గురై దీక్షకు దిగినట్టుగా నరహరి వెల్లడించాడు.
ఈ క్రమంలో బీజేపీ మిరుదొడ్డి మండల అధ్యక్షుడు ఎల్ముల దేవరాజు విషయం తెలుసుకొని అక్కడికి చేరుకొని నరహరికి చెప్పడం, ఎమ్మెల్యే రఘునందన్‌రావుతో దగ్గరుండి ఫోన్‌చేసి మాట్లాదించడంతో నరహరి తన దీక్షను విరమించుకున్నాడు.
ఇటీవల దివంగత నేత వైఎస్సార్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డారు రఘునందన్ రావు. అయన చేసిన వ్యాఖ్యల పట్ల వైసీపే శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో క్షమాపణలు కోరారు రఘునందన్ రావు.