Top
Batukamma

గ్రేటర్ లో బీజేపీకి పెద్ద దెబ్బ.. సొంత నేతలే నెగిటివ్ ప్రచారం!

గ్రేటర్ లో బీజేపీకి పెద్ద దెబ్బ.. సొంత నేతలే నెగిటివ్ ప్రచారం!
X
Highlights

ఇప్పటికే కూకట్ పల్లి లోని బీజేపీ కార్యాలయాన్ని ధ్వంసం చేయగా, ఇప్పుడు బీజేపీకి ఓటు వేయోద్దంటూ నెగిటివ్ గా ప్రచారం మొదలుపెట్టారట.

దుబ్బాక ఉప ఎన్నికలో గెలిచిన బీజేపీ రెట్టింపు ఉత్సాహంతో గ్రేటర్ ఎన్నికల్లో దూసుకుపోవాలని చూస్తోంది. దుబ్బాక ఉపఎన్నికకు ముందు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా మరో పార్టీ లేదని అనుకున్న వారందరికి షాక్ ఇస్తూ టీఆర్ఎస్ కి మేమే పోటి అంటూ చెప్పకనే చెప్పింది బీజేపీ..

అయితే దుబ్బాకలో సత్తా చాటిన బీజేపీకి గ్రేటర్ లో విజయం అంతా ఈజీ కాదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దుబ్బాకలో పార్టీ ఓటమిని చాలా సీరియస్ గా తీసుకున్న సీఎం కేసీఆర్, గ్రేటర్ లో గతంలో వచ్చిన సీట్ల కంటే ఎక్కువ సీట్లను సాధించాలనే కసితో ఉన్నారు.

దీంతో టీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీకి గట్టి పోటీ ఎదురువుతోంది. దీనికి తోడు సొంత పార్టీ నేతల నుంచే బీజేపీకి మరో షాక్ తగులుతుందట.. సొంత పార్టీ నేతలే పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారట. దుబ్బాకలో బీజేపీ గెలవడంతో ఆ పార్టీకి డిమాండ్ బాగా పెరిగిపోయింది.

దీనితో గ్రేటర్ లో బీజేపీ నుంచి టికెట్ ఆశించిన వారికి ఇవ్వకుండా టికెట్ లను అమ్ముకున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా లక్ష్మణ్ తమ బంధువులకి టికెట్ లను అమ్ముకున్నారనే ప్రచారం జోరుగా నడుస్తుంది. దీనితో ఇప్పుడు టికెట్ ఆశించి నిరాశతో ఉన్న అసంతృప్తి నేతలు రచ్చరచ్చ చేస్తున్నారట.

ఇప్పటికే కూకట్ పల్లి లోని బీజేపీ కార్యాలయాన్ని ధ్వంసం చేయగా, ఇప్పుడు బీజేపీకి ఓటు వేయోద్దంటూ నెగిటివ్ గా ప్రచారం మొదలుపెట్టారట. ఇలా కార్పొరేటర్ల టికెట్లు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారంటూ వ్యతిరేక ప్రచారం మొదలవ్వడంతో బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలే ఛాన్స్ లేకపోలేదు.

అటు టీఆర్ఎస్ తో గట్టి పోటి, ఇటు సొంత పార్టీ నెగిటివ్ ప్రచారం మధ్య బీజేపీ గ్రేటర్ లో ఏ మాత్రం సత్తా చాటుతుందనేది చూడాలి మరి!

Next Story
Share it