Top
Batukamma

దుబ్బాకలో టీఆర్ఎస్ ఓటమికి చంద్రబాబే కారణమట?

దుబ్బాకలో టీఆర్ఎస్ ఓటమికి చంద్రబాబే కారణమట?
X
Highlights

తెలంగాణలో బీజేపీకి సహకరిస్తే ఏపీలో రూట్ క్లియర్ అయ్యే ఛాన్స్ ఉందని, బాబు చేయాల్సింది చాలా సైలెంట్ గా చేసేశారనే భావిస్తున్నారట టీఆర్ఎస్ నేతలు.

దుబ్బాక ఉపఎన్నికల ఫలితాలను టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ చాలా లైట్ తీసుకున్నట్టుగా పైకి కనిపిస్తున్నప్పటికి లోలోపల మాత్రం అంతర్మథనంలో పడిపోయింది. టీఆర్ఎస్ కి కలిసొచ్చిన ఉపఎన్నికలు, సిట్టింగ్ ప్లేస్, పైగా సానుభూతి, ట్రబుల్ షూటర్ హరీష్ రావు ఇవన్నీ టీఆర్ఎస్ ని గట్టెకించలేకపోయాయి.

పార్టీ ఓటమిని విశ్లేషించుకుంటున్న టీఆర్ఎస్ నేతలకు టీడీపీ అధినేత చంద్రబాబు అనే తీగ తగిలిందట. దుబ్బాకలో టీడీపీ పోటీ చేయలేదు కానీ గతంలో పోటీ చేసిన చరిత్ర ఉంది కాబట్టి ఇంకా ఆ పార్టీ క్యాడర్ మాత్రం ఇంకా ఉంది. వాళ్ల ద్వారా బీజేపీకి అనుకూలంగా బాబు సైలెంట్ ఓటింగ్ చేయించారనే అనుమానం కలుగుతోందట టీఆర్ఎస్ నేతలకు.

పైగా దుబ్బాకలో బీజేపీని గెలిపించడం, వారి మన్ననలు పొందడం చంద్రబాబుకు ఇప్పుడు చాలా అవసరం కూడా.. తెలంగాణలో బీజేపీకి సహకరిస్తే ఏపీలో రూట్ క్లియర్ అయ్యే ఛాన్స్ ఉందని, బాబు చేయాల్సింది చాలా సైలెంట్ గా చేసేశారనే భావిస్తున్నారట టీఆర్ఎస్ నేతలు. అయితే ఇదే నిజం అయినప్పటికీ టీఆర్ఎస్ నేతలు బయటకు చెప్పలేరు కూడా.

ఎందుకంటే తెలంగాణలో ఇంకా చంద్రబాబు ప్రభావం ఉందనే సంకేతాలు బయటకు వెళ్లిపోతాయి కాబట్టి.. సో బాబు దుబ్బాకలో బీజేపీ సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తారో, బాబు పాత్రను టీఆర్ఎస్ కూడా అంతే రహస్యంగా ఉంచుతుందన్న మాట.

Next Story
Share it