Top
Batukamma

కత్తి కార్తీకకు షాక్.. బంజారాహిల్స్ లో చీటింగ్ కేసు..!

కత్తి కార్తీకకు షాక్.. బంజారాహిల్స్ లో చీటింగ్ కేసు..!
X
Highlights

మోసం చేశారని వారు పోలీసులకు తెలిపారు. దీంతో బంజారాహిల్స్ పోలీసులు కత్తి కార్తీక, ఆమె అనుచరులపై కేసు ఫైల్ చేశారు.

యాంకర్, బిగ్ బాస్ కంటెస్టెంట్ కత్తికార్తీకపై కేసు నమోదైంది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆమెపై చీటింగ్ కేసు ఫైల్ అయ్యింది.

హైదరాబాద్ శివారు అమీన్ పూర్ లోని 52 ఎకరాల భూమిపై వివాదం కొనసాగుతోంది. ఈ వివాదాన్ని సెటిల్ మెంట్ చేస్తానని కత్తి కార్తీక, ఆమె అనుచరులు తమ దగ్గర కోటి రూపాయలు తీసుకున్నారంటూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

డబ్బులు తీసుకుని పనిచేయకుండా మోసం చేశారని వారు పోలీసులకు తెలిపారు. దీంతో బంజారాహిల్స్ పోలీసులు కత్తి కార్తీక, ఆమె అనుచరులపై కేసు ఫైల్ చేశారు.


అయితే.. కత్తి కార్తీక ప్రస్తుతం పాలిటిక్స్ లో బిజీ అయ్యారు. దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉపఎన్నికల్లో పోటీచేస్తున్నారు. స్వతంత్ర్య అభ్యర్థిగా ఆమె ఎన్నికల బరిలోకి దిగారు. ఇలాంటి టైంలో ఆమెపై కేసు నమోదు కావడం ఆసక్తికరంగా మారింది.

Next Story
Share it