Top
Batukamma

విరిగిన కుర్చీలు, చిరిగిన చొక్కాలు.. తన్నుకున్న బీజేపీ నేతలు!

విరిగిన కుర్చీలు, చిరిగిన చొక్కాలు.. తన్నుకున్న బీజేపీ నేతలు!
X
Highlights

అంతేకాకుండా రాష్ట్రంలో బీజేపీని కాపాడుకుంటూ వస్తున్న రాజాసింగ్ ను పక్కన పెట్టడం కరెక్ట్ కాదంటూ నినాదాలు చేశారు.

తెలంగాణ బీజేపీ కార్యాలయంలోఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గన్‌ఫౌండ్రికి చెందిన శైలేందర్‌, ఓంప్రకాష్ వర్గీయుల మధ్య ఘర్షణ నెలకొంది. బీ ఫామ్‌ తీసుకునేందుకు వచ్చిన ఓం ప్రకాష్‌పై శైలేందర్‌ యాదవ్ వర్గీయులు దాడికి యత్నించారు. ఈ నేపధ్యంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. కార్యాలయంలోని కుర్చీలు విరిపోగా, నేతల చొక్కాలు చినిగిపోయాయి.

టీడీపీ నుంచి వచ్చిన ఓంప్రకాష్‌కు టికెట్ ఎలా కేటాయిస్తారని శైలేందర్‌ వర్గీయుల ప్రశ్నించారు. రాజాసింగ్‌ను గెలిపించినందుకే కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ తమపై కక్షగట్టారని, కార్యకర్తలకు కిషన్‌ రెడ్డి, లక్ష్మణ్‌ అన్యాయం చేస్తున్నారని, ఇద్దరు కలిసి టికెట్లు అమ్ముకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతేకాకుండా రాష్ట్రంలో బీజేపీని కాపాడుకుంటూ వస్తున్న రాజాసింగ్ ను పక్కన పెట్టడం కరెక్ట్ కాదంటూ నినాదాలు చేశారు.

Next Story
Share it