సిటీ నడిబొడ్డున CM KCR బంధువుల కిడ్నాప్..

రాజకీయ నాయకుడి కుటుంబసభ్యులే ఈ పని చేసి ఉంటారని బాధితుల ఫ్యామిలీ మెంబర్స్ అనుమానం వ్యక్తంచేస్తున్నారు.
CM kcr relatives kidnapped in Bowenpally : సిటీ నడిబొడ్డులో సీఎం కేసీఆర్ బంధువుల కిడ్నాప్ జరిగింది. ఈ ఘటనతో జంటనగరాల పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అచ్చం సినీ ఫక్కీలో జరిగిన ఈ కిడ్నాప్ తో పోలీసులు, టీఆర్ఎస్ పార్టీ నేతలు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
సికింద్రాబాద్ లోని బోయిన్ పల్లిలో ఉంటున్న సీఎం కేసీఆర్ సమీప బంధువు, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రవీణ్ తో పాటు మరో ఇద్దరు సోదరుడు కిడ్నాప్ కు గురయ్యారు. ఆదాయపన్ను శాఖ అధికారులమని చెప్పి ఇంట్లో చొరబడ్డారు నిందితులు. తమ వెంబడి నకిలీ పోలీసులను పట్టుకొచ్చారు. నిన్న రాత్రి ఏడున్నర ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సాయంత్రం టైంలో ఇలా ఓ వీఐపీ ఇంట్లో చొరబడి కిడ్నాప్ చేయడంతో పోలీసులు అవాక్కయ్యారు.
మహబూబ్నగర్ జిల్లాకు చెందిన న్యాయవాది ప్రతాప్ కుమార్ తన సోదరులతో కలిసి బోయిన్ పల్లిలోని మనో వికాస్ నగర్ లో నివాసముంటున్నారు. నిన్న రాత్రి ఏడున్నర గంటల టైంలో మూడు కార్లలో నిందితులు వచ్చారని చెబుతున్నారు. ఐటీ అధికారులమని చెప్పి ఇంట్లోకి చొరబడ్డారని, బెదిరించి ముగ్గురు సోదరులను తీసుకెళ్లారని చెబుతున్నారు. ఇంట్లోని ల్యాప్ టాప్, సెల్ ఫోన్లు కూడా పట్టుకెళ్లారని అంటున్నారు.
సీఎం బంధువులు కావడంతో ఏకంగా హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ రంగంలోకి దిగారు. బాధితుల ఇంటికి చేరుకుని ఎంక్వైరీచేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మాలోతు కవిత కూడా స్పాట్ కు చేరుకున్నారు. స్పెషల్ టీంలను రంగంలోకి దింపి గాలింపు మొదలుపెట్టారు.
కిడ్నాప్ కు గురైన ముగ్గురిని చివరకు వికారాబాద్ లో విడిచిపెట్టి వెళ్లిపోయారు నిందితులు. వికారాబాద్ లో రోడ్డుపై వదిలేసి వెళ్లినట్టు చెబుతున్నారు. వారిని గుర్తించిన పోలీసులు సేఫ్ గా ఇంటికి తీసుకొచ్చారు.
రాయలసీమకు చెందిన ఓ రాజకీయ నాయకుడి కుటుంబసభ్యులే ఈ పని చేసి ఉంటారని బాధితుల ఫ్యామిలీ మెంబర్స్ అనుమానం వ్యక్తంచేస్తున్నారు.
- రాశిఫలాలు : ఈ రాశుల వారికి ఈ రోజు అద్భుతం
- V6 తీన్మార్ యాంకర్ రాధ(ధరణి ప్రియ) బయట ఎలా ఉంటుందో తెలుసా..?
- ఈ పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతోందా..? పాముకు పాలు పోస్తోందా..?