CM Kcr : దుబ్బాక ఓటమిపై ఇవాళ కేసీఆర్ రివ్యూ

దుబ్బాక దెబ్బతో టీఆర్ఎస్ లో తర్వాత ఏం జరగబోతోందన్నది ఇఫ్పుడు ఆసక్తి కరంగా మారింది.
CM Kcr review on dubbaka bypoll:
దుబ్బాక ఎన్నికల్లో తగిలిన షాక్ నుంచి టీఆర్ఎస్ ఇంకా కోలుకోవడం లేదు. భారీ గెలుస్తామని ఆశలు పెట్టుకుంటే.. కనీసం తక్కువ ఓట్ల తేడాతో కూడా గెలవలేకపోయింది టీఆర్ఎస్. దీంతో ఇప్పుడు తలపట్టుకుంటున్నారు టీఆర్ఎస్ నేతలు.
పార్టీ చీఫ్ కేసీఆర్ నుంచి.. దుబ్బాక ఎన్నికలను దగ్గరుండి చూసున్న హరీశ్ రావు వరకు ఇంకా అదే ఆందోళనలో ఉన్నారు. దుబ్బాక దెబ్బతో టీఆర్ఎస్ లో తర్వాత ఏం జరగబోతోందన్నది ఇఫ్పుడు ఆసక్తి కరంగా మారింది.
దుబ్బాకలో ఓడిపోతే హరీశ్ రావుపై వేటు తప్పదని ఎన్నికల ముందు నుంచే ప్రచారం జరుగుతోంది. కేటీఆర్ కు సీఎం సీటుకు లైన్ క్లియర్ చేసేందుకు హరీశ్ రావును దుబ్బాక ఎన్నికల పేరుతో బలి చేసే కుట్ర జరుగుతోందనే వార్తలు కూడా వచ్చాయి.
దుబ్బాక ఎన్నికలయ్యాక మాట్లాడిన హరీశ్ రావు. ఎన్నికల ఓటమి బాధ్యత తనదేనని ప్రకటించారు. సమీక్షించి త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
అయితే.. ఇప్పుడు టీఆర్ఎస్ ఏ నిర్ణయం తీసుకోబోతోంది.. ఏం చేయబోతోంది..? అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు.. ముఖ్యమంత్ర కేసీఆర్ ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. అందుబాటులో ఉన్న మంత్రులతో ఇవాళ సీఎం భేటీ కాబోతున్నారని సమాచారం.
దుబ్బాక ఓటమి బాధ ఓ వైపు ఉన్నా.. త్వరలోనే గ్రేటర్ ఎన్నికలు జరగబోతున్నాయి. దుబ్బాకలో కనిపించిన పరిస్థితులు గ్రేటర్ లో రిపీట్ అయితే.. టీఆర్ఎస్ కి గడ్డు రోజులు మొదలైనట్టే. దీంతో ఇప్పుడు ఏం చేయాలనే దానిపై కేసీఆర్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.
అందుకే కేసీఆర్.. మంత్రులు, ముఖ్యనేతలతో సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఈ భేటీలో కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.