Top
Batukamma

సన్న వడ్లకు ఎక్కువ ధర ఇస్తం... మేమే కొంటం :కేసీఆర్

సన్న వడ్లకు ఎక్కువ ధర ఇస్తం... మేమే కొంటం :కేసీఆర్
X
Highlights

రాష్ట్రంలోని రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు ముఖ్యమంత్రి కేసీఆర్. రైతులు పండించిన సన్నరకాలను ప్రభుతమే కొంటుందని...

రాష్ట్రంలోని రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు ముఖ్యమంత్రి కేసీఆర్. రైతులు పండించిన సన్నరకాలను ప్రభుతమే కొంటుందని చెప్పారు. జనగామ జిల్లా కొడకండ్లలో రైతు వేదిక ప్రారంభించిన తర్వాత ఆయన మాట్లాడారు.

సన్న బడ్లకు ఎక్కువ వచ్చేలా చూస్తానని తాను చెప్పానని.. తాను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని సీఎం కేసీఆర్ తెలిపారు. దొడ్డు వడ్ల కంటే సన్న వడ్లకు ఎక్కువ ధర వచ్చేలా చూస్తానన్నారు. ఇంకా సన్నరకం వరికోతలు ప్రారంభం కాలేదని.. ప్రారంభం కాగానే ధరలపై నిర్ణయం తీసుకుంటానన్నారు.

కొన్ని రాజకీయ పార్టీలు కావాలనే రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు సీఎం. కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ.. వట్టి గడ్డి తగలబెట్టి పంట కాల్చేసినట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నారని ఆరోపించారు. సోషల్ మీడియా మొత్తం యాంటీ సోషల్ మీడియా అయ్యిందన్నారు. కొన్ని పార్టీలు బద్నాం చేసుడే పనిగా పెట్టుకన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story
Share it