Top
Batukamma

తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

corona cases increasing in telangana
X
Highlights

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 42,40,748కి చేరింది

Corona cases increasing in telangana : తెలంగాణలో గత కొద్ది రోజులుగా తగ్గుముఖం పడుతూ వచ్చిన కరోనా వైరస్ కేసులు మళ్లీ భారీగా పెరిగాయి.. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 43,790 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 1,531 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,37,187కి చేరింది. ఇందులో యాక్టివ్ కేసులు 18,456 ఉండగా.. ఇప్పటివరకు 2,17,401 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా ఆరు మరణాలు సంభవించగా, మొత్తం 1,330 మంది కరోనా వైరస్ తో చనిపోయారు.

ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 42,40,748కి చేరింది.

ఇటీవలే దేశవ్యాప్తంగా కూడా కరోనా కేసుల్లో పెరుగుదల కనిపించింది. ఢిల్లీలో ఇటీవల ఒకేరోజు 5 వేలకు పైగా కేసులు వచ్చాయి. అటు.. కేరళలోనూ ఓనం తర్వాత కేసులు పెరిగాయి.

చలికాలం కావడంతో పాటు.. పండుగ సీజన్ కారణంగా కరోనా(Corona cases) మరోసారి విజృంభించే ప్రమాదం ఉందని ఆరోగ్యశాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరించారు.

- అక్టోబర్ 30 రాశిఫలాలు

- తగ్గిన బంగారం ధరలు.. పెరిగిన వెండి ధరలు...

- పెళ్లైన కాసేపటికే.. వ్యాన్ బోల్తా.. ఏడుగురు మృతి

Next Story
Share it