Top
Batukamma

లైట్ తీసుకోకండి.. హైదరాబాద్‌‌‌‌‌లో 54 శాతం మందికి కరోనా వచ్చిపోయింది!

లైట్ తీసుకోకండి.. హైదరాబాద్‌‌‌‌‌లో 54 శాతం మందికి కరోనా వచ్చిపోయింది!
X
Highlights

ప్రస్తుతం కరోనా వ్యాప్తి చాలా వరకు తగ్గిపోయిందని చాలామంది అనుకుంటున్నారు. హైదరాబాద్ లో ఉన్న చాలామంది మాకైతే కరోనా రాలేదు.. మేం సేఫ్ అని అనుకుంటున్నారు

ప్రస్తుతం కరోనా వ్యాప్తి చాలా వరకు తగ్గిపోయిందని చాలామంది అనుకుంటున్నారు. హైదరాబాద్ లో ఉన్న చాలామంది మాకైతే కరోనా రాలేదు.. మేం సేఫ్ అని అనుకుంటున్నారు. కానీ దీనికి సంబంధించి షాకింగ్ వాస్తవాలు బయటపెట్టింది CCMB.

హైదరాబాద్ లో ఇప్పటికే 54 శాతం మందికి కరోనా వచ్చిపోయిందని సెరోలాజికల్ సర్వేలో వెల్లడైంది. CSIR, ICMR, NIN, భారత్ బయోటెక్ కలిసి హైదరాబాద్ లో సెరోలాజికల్ సర్వే చేశాయి. 9000 మంది నుంచి శాంపిల్స్ తీసుకుని ఈ పరీక్షలు చేశారు.

హైదరాబాద్ లోని 30 వార్డుల్లో శాంపిల్స్ సేకరించారు. ఒక్కో వార్డు నుంచి 300 శాంపిల్స్ సేకరించారు. కొన్ని వార్డుల్లో 70 శాతం మందిలో యాంటీబాడీలు కనిపించాయి. ఇంకొన్ని వార్డుల్లో 30శాతం మందిలో కనిపించాయి. పురుషుల కంటే ఎక్కువగా మహిళల్లో యాంటీబాడీలున్నాయని సర్వే చేసిన శాస్త్రవేత్తలు వెల్లడించారు.

56 శాతం మహిళల్లో, 53 శాతం పురుషుల్లో యాంటీబాడీలు కనిపించాయి.

Next Story
Share it