పీవీకి, కేసీఆర్‌కి నక్కకు.. నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది..!

ఎమ్మెల్సీ ఎన్నికలతో మరోసారి వేడెక్కాయి తెలంగాణ రాజకీయాలు. అటు అధికార పార్టీ, ఇటు విపక్ష పార్టీలు ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడం మొదలుపెట్టాయి.
ఎమ్మెల్సీ ఎన్నికలతో మరోసారి వేడెక్కాయి తెలంగాణ రాజకీయాలు. అటు అధికార పార్టీ, ఇటు విపక్ష పార్టీలు ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడం మొదలుపెట్టాయి. హైదరాబాద్- రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ స్థానం నుంచి మాజీ పీఎం పీవీ కుమార్తె అయిన వాణీదేవిని బరిలోకి దింపడంపై పట్ల బీజేపీ, కాంగ్రెస్ నేతలు అధికార టీఆర్ఎస్ పైన దుమ్మెత్తిపోస్తున్నాయి.
కేవలం రాజకీయ స్వార్థం కోసమే కేసీఆర్ ఆమెకి అవకాశమిచ్చారని, అది కూడా ఓడిపోయే చోటు నుంచి ఇచ్చారని, కాంగ్రెస్, బీజేపీ నేతలు ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. తాజాగా మరో పార్టీ నేత ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. " పీవీ చనిపోయి బతికిపోయారని.. లేకుంటే ఆయన కుమార్తె మాటలకు ఆత్మహత్య చేసుకునేవారని" సీనియర్ నేత, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.
కేసీఆర్‌ను తన తండ్రి పీవీతో ఆమె పోల్చడాన్ని ఆయన తప్పుబట్టారు. పీవీకి, కేసీఆర్‌కి నక్కకు.. నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని అన్నారు. ఆమె మాటలు వింటే పీవీ ఏ లోకంలో ఉన్నా బాధపడడం ఖాయమని అన్నారు. అంతేకాకుండా టీఆర్ఎస్ పార్టీ పైన, కేసీఆర్ పైన వ్యంగ్యాస్త్రాలు సంధించారు నారాయణ.
ఎమ్మెల్సీ ఎన్నికలకు టీఆర్ఎస్ అద్దె అభ్యర్థిని తెచ్చుకుందంటూ కామెంట్స్ చేశారు. టీఆర్ఎస్ పేరుతో ఓట్లు అడిగితే వేయరనే పీవీ పేరుతో ఓట్లు అడుగుతున్నారంటూ విమర్శలు చేశారు. అంతేకాకుండా కేసీఆర్.. పీవీ భుజంపై తుపాకీ పెట్టి కాంగ్రెస్‌ను కాలుస్తున్నాడని అన్నారు నారాయణ.