Top
Batukamma

04-12-2020 శుక్రవారం నేటి పంచాంగం,రాశిఫలాలు

04-12-2020 శుక్రవారం నేటి పంచాంగం,రాశిఫలాలు
X
Highlights

వ్యయప్రయాసలతో పనులు పూర్తి. ఎంత శ్రమపడ్డా ఫలితం కనిపించదు. దూరప్రయాణాలు. బంధువులతో వైరం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆచితూచి వ్యవహరించండి.

ఓం శ్రీ గురుభ్యోనమ

శ్రీ శార్వరి నామ సంవత్సరం,దక్షిణాయణం శరత్ ఋతువు,కార్తీక మాసం బహుళ పక్షం,తిధి:చవితి/చతుర్థీ సా5.35 తదుపరి పంచమి,నక్షత్రం:పునర్వసు మ12.15 తదుపరి పుష్యమి ,యోగం:శుక్లం ఉ9.58 తదుపరి బ్రహ్మం,కరణం:బాలువ సా5.35 తదుపరి కౌలువ తె5.23,వర్జ్యం :రా8.21 - 9.59,దుర్ముహూర్తం :ఉ8.31 - 9.15 &మ12.11 - 12.55,అమృతకాలం:ఉ9.46 - 11.25 & తె6.06 నుండి రాహుకాలం :ఉ10.30 - 12.00,యమగండం/కేతుకాలం:మ3.00 - 4.30, సూర్యరాశి:వృశ్చికం||చంద్రరాశి: మిథునం,సూర్యోదయం:6.18,సూర్యాస్తమయం:5.20

సర్వే జనాః సుఖినో భవంతు

మేషం:

వ్యయప్రయాసలతో పనులు పూర్తి. ఎంత శ్రమపడ్డా ఫలితం కనిపించదు. దూరప్రయాణాలు. బంధువులతో వైరం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆచితూచి వ్యవహరించండి.

వృషభం:

ముఖ్యమైన పనుల్లో పురోగతి. భూలాభాలు. పాతమిత్రుల కలయిక. డబ్బుకు లోటు రాదు. నిరుద్యోగులకు శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

మిథునం:

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ప్రయాణాలు తుదిక్షణంలో వాయిదా. దైవదర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.

కర్కాటకం:

బంధువులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

సింహం:

సన్నిహితులతో వివాదాలు సర్దుకుంటాయి. వస్తులాభాలు. పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.

కన్య:

శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలాభం. పరిస్థితులు అనుకూలిస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. భూ, వాహనయోగాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

తుల:

వివాదాలతో సతమతమవుతారు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో జాప్యం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

వృశ్చికం:

ఆర్థికంగా ఇబ్బందులు. కొత్త రుణయత్నాలు. అనుకున్న పనుల్లో అవాంతరాలు. ఆస్తుల కొనుగోలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

ధనుస్సు:

బంధువుల నుంచి ముఖ్య సమాచారం. ఇంటాబయటా అనుకూల వాతావరణం. కొన్ని వ్యవహారాలలో విజయం. భూలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ తొలగుతుంది.

మకరం:

కొన్ని పనులను అనూహ్యంగా వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళ పరుస్తాయి.

కుంభం:

కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. పనుల్లో ఆటంకాలు అధిగమిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.

మీనం:

వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు అందుతుంది. వస్తు, వస్త్రలాభాలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలస్థితి.

Next Story
Share it