Top
Batukamma

ఈ దసరాకు కుమ్మి వదిలేశారు.. లిక్కర్ ఫుల్లు సేల్స్..!

ఈ దసరాకు కుమ్మి వదిలేశారు.. లిక్కర్ ఫుల్లు సేల్స్..!
X
Highlights

దసరా పండుగకు మద్యం ప్రవాహం ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ సారి కూడా దసరాకు భారీగా బాటిల్స్ ఖాళీ అయ్యాయి.

Dasara liquor sales : పండుగలంటే ఒకప్పుడు కుటుంబమంతా ఒక్కచోట చేరి సంతోషంగా గడపటం. కానీ ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారింది. ఎక్కడికక్కడ బ్యాచ్ లుగా తయారై.. తాగి ఊగడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. పండుగొచ్చిందంటే మద్యం ఏరులై పారుతోంది. లిక్కర్ వ్యాపారుల గల్లా పెట్టే నిండుతోంది.

దసరా పండుగకు మద్యం ప్రవాహం ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ సారి కూడా దసరాకు భారీగా బాటిల్స్ ఖాళీ అయ్యాయి. కరోనాను ఖాతరు చేయకుండా మందు కుమ్మి వదిలిపెట్టారు మనోళ్లు.

ఈ నెల 22 నుంచి 25 వరకు రాష్ట్రంలో భారీగా మద్యం అమ్ముడయ్యింది. లిక్కర్ డిపోల నుంచి బయటకు వెళ్లిన మద్యం, బీర్‌ కేసుల విలువ రూ.812 కోట్లకు పైగానే ఉందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అంటే రోజుకు సగటున రూ.203 కోట్ల విలువైన లిక్కర్ సేల్ జరిగిందన్నమాట.

నెల మొత్తం లెక్కతిస్తే మాత్రం అది చాలా తక్కువగా ఉంది. నెల సగటు ప్రకారం చూస్తే రోజుకు రూ.82 కోట్ల విలువైన మద్యం మాత్రమే అమ్ముడయ్యింది. పండగ టైంలోని ఆ నాలుగు రోజులు మాత్రం సేల్స్ బీభత్సంగా పెరిగిపోయాయి.


ఈ నెల లిక్కర్ సేల్స్ లెక్కలు పరిశీలిస్తే లిక్కర్, బీర్లు కలిపి దాదాపు 50 లక్షల కేసుల వరకు అమ్ముడయ్యాయి. వీటి విలువ రూ.2,112 కోట్లుగా ఉంది. ఈ నెల 27 నాటికి 27,08,292 కేసుల లిక్కర్.. 22,65,397 కేసుల బీర్లు డిపోల నుంచి రాష్ట్రంలోని వైన్‌ షాపులకు చేరాయి. ఇందులో మూడో వంతు దసరా నాలుగు రోజుల్లోనే అమ్ముడైపోయింది.

పండగ సమయంలోని (dasara liquor sales) నాలుగు రోజుల్లో 9,41,900 కేసుల లిక్కర్.. 9,29,694 కేసుల బీర్ల విక్రయాలు జరిగాయని ఎక్సైజ్‌ శాఖ చెబుతోంది.

- తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

- అక్టోబర్ 30 రాశిఫలాలు

- పెళ్లైన కాసేపటికే.. వ్యాన్ బోల్తా.. ఏడుగురు మృతి

Next Story
Share it