Top
Batukamma

కళ్లు పీకేస్తారా..? సీఎంకు దాసోజు శ్రవణ్ సవాల్

కళ్లు పీకేస్తారా..? సీఎంకు దాసోజు శ్రవణ్ సవాల్
X
Highlights

తెలంగాణలో అడపిల్లలకు రక్షణ ఉందా అని ప్రశ్నించారు. రక్షకులే రాక్షసత్వం చేస్తే ఎలా, పాలకులే పీడీస్తే ఎలా అని ప్రశ్నించారు.

dasoju sravan fires on gangula kamalakar : తెలంగాణ మంత్రి రాసలీలల వ్యవహారంపై AICC జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. మంత్రులు అభినవ కీచకులా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహిళను వేధించి, అవమానపరిచి లొందీసుకున్న గంగుల కమలాకర్‌ను వెంటనే మంత్రివర్గం నుంచి భర్తరప్ చేయాలని డిమాండ్ చేశారు.

రెండు రోజులుగా జరుగుతున్న వ్యవహారంపై ట్విట్టర్ లో స్పందించారు శ్రవణ్. తెలంగాణలో అడపిల్లలకు రక్షణ ఉందా అని ప్రశ్నించారు. రక్షకులే రాక్షసత్వం చేస్తే ఎలా, పాలకులే పీడీస్తే ఎలా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

ఎవరైనా ఆడపిల్లల వైపు చూస్తే కళ్లు పీకేస్తానన్న ముఖ్యమంత్రికి... ఇప్పుడు గంగుల కమలాకర్ కళ్లు పీకే దమ్ము కేసీఆర్ కు ఉందా అని ప్రశ్నించారు.

గంగుల కమలాకర్‌పై వస్తున్న ఆరోపణలపై షీ టీమ్‌లు రంగంలోకి దిగి పూర్తి స్థాయి విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ద్రోహికి మంత్రి పదవి ఇచ్చి అందలం ఎక్కించిన కేసీఆర్ (dasoju sravan fires on gangula kamalakar)ఇప్పుడైన సరైన దిశగా ఆలోచించాలన్నారు.

- హీరోయిన్ పై మంత్రి గారి కన్ను.. పదవిపోయే దాకా వచ్చింది..!

- Daily Horoscope : అక్టోబర్ 31 మీ రాశిఫలాలు

మిగతా అపోజిషన్ పార్టీలు.. కూడా మంత్రి తీరుపై ఫైరవుతున్నాయి.

Next Story
Share it