Top
Batukamma

వీడు చేసిన పనికి గాండ్రించి ఉమ్మేసిన తక్కువే.. !

వీడు చేసిన పనికి గాండ్రించి ఉమ్మేసిన తక్కువే.. !
X
Highlights

శవాల మీద చిల్లర ఏరుకునే మనిషివిరా నువ్వు అంటారు... ఆ మాటకి అక్షరాలకి నిలువెత్తు రూపమే పై ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి.. ఇతని చేసిన పని ఏంటో తెలిస్తే.. గాండ్రించి ఉమ్మేస్తారు.

శవాల మీద చిల్లర ఏరుకునే మనిషివిరా నువ్వు అంటారు... ఆ మాటకి అక్షరాలకి నిలువెత్తు రూపమే పై ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి.. ఇతని చేసిన పని ఏంటో తెలిస్తే.. గాండ్రించి ఉమ్మేస్తారు.. అది కూడా తక్కువే అంటారు..

ఇంతకి అతను ఏం చేశాడంటే... ఓ వ్యక్తి తల్లి అంత్యక్రియలకు మంజూరైన చెక్కును అందించేందుకు రూ. 5 వేల లంచం అడిగాడు. ఈ ఘటన హైదరాబాద్‌ నగరంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మూసారాంబాగ్‌ కి చెందిన అనుముల ఆశయ్య అనే వ్యక్తి పాతబస్తీ సర్ధార్‌మహల్‌లోని జీహెచ్‌ఎంసీలో కామాటి (కార్మికుడు)గా పనిచేసి పదవీ విరమణ పొంది.. ఆ తరువాత 2013లో చనిపోయాడు.

అతను చనిపోయక అతని భార్య బాలమ్మకు పింఛను వచ్చేది. అయితే కొద్ది రోజుల క్రితం ఆమె కూడా చనిపోయింది. ఆమె అంత్యక్రియలకు జీహెచ్‌ఎంసీ నుంచి రూ.20 వేలు ఇస్తుందని తెలుసుకోని ఆమె కుమారుడు క్రాంతికుమార్.. జీహెచ్‌ఎంసీ సర్కిల్‌-10, పూల్‌బాగ్‌, ఫలక్‌నుమా, చార్మినార్‌ జోన్‌లో ఆఫీసు సూపరింటెండెంట్‌గా పనిచేసే వాద్యా పూల్‌ సింగ్‌ ని కలిశాడు.

అయితే ఆ చెక్కు ఇవ్వాలంటే అందులోనుంచి అయిదు వేల రూపాయలని ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీనితో క్రాంతి కుమార్ అవినీతి శాఖాకి విషయం చెప్పడంతో అధికారుల సూచనతో మంగళవారం రూ.5 వేలు పూల్‌సింగ్‌కు ఇస్తుండగా ఏసీబీ టీం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఇలాగే ఎవరైనా లంచాలు డిమాండ్‌ చేస్తే తన నంబరు 9440446109 కు కాల్‌ చేయవచ్చని అధికారులు తెలిపారు.

Next Story
Share it