Top
Batukamma

విశ్లేషణ: ఈ మగాడిదల బుద్ధి ఇంతేనా..? వాడూ మగాడూ.. వీడూ మగాడే..!

విశ్లేషణ: ఈ మగాడిదల బుద్ధి ఇంతేనా..?  వాడూ మగాడూ.. వీడూ మగాడే..!
X
Highlights

ఎవడు ప్రేమిస్తాడో తెలియదు, ఏమి ఆశిస్తాడో తెలియదు, యాసిడ్ పోస్తాడో తెలియదు, మచ్చుకత్తితో నరికేస్తాడో తెలియదు,

Dharmapuri arvind comments controversy : పుట్టాక ఏ ఆరాటమూ, ఏ పోరాటమూ చేయకుండా మగాడు బ్రతికే సమాజంలో బ్రతకడానికి ప్రతి ఆడపిల్ల తాను చనిపోయేలోగా ఒక్కసారైనా ప్రాణాలు పణంగా పెట్టి యుద్దం చేస్తుందని ఈ మగాడిదలకు ఈ ఆధునిక కాలంలోనూ అర్థంకాకపోవడం దౌర్భాగ్యం. ఇలా ప్రాణాలు పణంగా పెట్టిన యుద్దంలోని విజయం తాలూకు ఫలితమే వాడు భూమ్మీద పుట్టాడని తెలుసుకోవాలి.

ఈ నేలమీద వడ్లగింజ మింగకుండా, ఏ కాలువలోనో, చెత్తకుప్పతొట్లోనో విసిరేయ బడకుండా పొత్తిళ్లలో మిగలడంతోనే ఆమె పోరాటం మొదలవుతుంది. అప్పటినుండి ఇంట్లో సోదరుడితో పోటీపడాలి, తల్లిదండ్రుల (parents) పెంపకంలో వివక్ష అనుభవించాలి, పసితనం నుండే ఏ పక్కింటివాడు, ఏ టీచరు(teacher), ఏ బంధువు ఎక్కడ, ఎందుకు చెయ్యేస్తాడో తెలియకుండానే కాపాడుకోవాలి, బడిలో, వీధిలో పోలికలు, అవమానలు తలదించుకుని ఎదుర్కోవాలి.

ఎవడు ప్రేమిస్తాడో తెలియదు, ఏమి ఆశిస్తాడో తెలియదు, యాసిడ్ పోస్తాడో తెలియదు, మచ్చుకత్తితో నరికేస్తాడో తెలియదు, ఎక్కడ ప్రేమించాల్సి వస్తుందో తెలియదు, ఎక్కడ ప్రేమ(love)ని వదులుకోవాలో తెలియదు, తల్లిదండ్రులకు ఎప్పుడు బరువవుతామో తెలియదు, ఎవడికిచ్చి కట్టబెడతారొ తెలియదు, కట్టుకున్నోడికి ఎప్పుడు ఏ ఆలోచన పుడుతుందో తెలియదు, పుట్టిన పిల్లలు ఎప్పుడు తెలివి తక్కువ దానివని ప్రకటిస్తారో తెలియదు.


ప్రాతివ్రత్యమ్మీద ఎప్పుడు మొగుడికి అనుమానమొస్తుందో తెలియదు, కట్టుకున్నోడు ఎప్పుడు పోతుపోతూ సుమంగళత్వం తీసుకుపోతాడో తెలియదు, వీధుల్లో వైధవ్యాన్ని ఎవరు చీదరిచుకుంటారో తెలియదు. ఇలా బ్రతికినంత కాలం అడుగడుగునా ఎదుట కనిపించే కన్నవాళ్ళూ, తోడబుట్టినవాళ్లూ, కట్టుకున్నవాళ్లూ, కనుకున్నవాళ్లే గాదు అడ్డమైన ప్రతి వ్యక్తికితో బస్సులో, రోడ్డుమీద, ఇంటిబయట, పనిచోట్లా సమాజంలో ప్రతి వ్యక్తిని ఎదుర్కొంటూ, అంతకన్నా ముందు తనలో తరలుగా పెంచిన ఒక అబలత్వం మీద పెద్ద యుద్దమే చేస్తూ బ్రతుకుతోన్న మనిషిమీద ఇప్పటికీ ఇలా అకారణంగా దాడి చేయడం గర్హనీయం.

ప్రాణం పణంగా పెట్టి కన్న స్త్రీ (women) మీదా, స్త్రీతనమ్మీదా ఈ మగాడు గొప్ప కృతఙ్ణుడై వుండాలి. ఈ సృష్టిని కంటోన్న స్త్రీ పట్ల గౌరవం వుండాలి. మగవాడే గ్రంధాలు, పాటలు రాసి సుకుమారతని, బలహీనతని మానసికంగా పుట్టుకతోనే అమెని తయారు చేస్తున్నాననే గ్రహింపు వుండాలి. వాస్తవానికి భౌతికంగా స్త్రీ, పురుషుడికన్నా బలవంతురాలని గ్రహించాలి. కనీసం మగవాడికి వచ్చే చాలా రోగాల్ని ఆమె రాకుండానే ఎదుర్కొంటోందని గుర్తించాలి.

వాడూ మగాడూ, వీడూ మగాడే, అదికూడా పనికిమాలిన రాజకీయం గురించి, మధ్యలో ఆడతనమ్మీద అపవాదు ఎందుకు? ఇట్లాంటి గాడిదకొడుకులు సహజంగా సంప్రదాయం, సంస్కృతి, ప్రాతివ్రత్యం, భారతీయత గురించి మాట్లాడుతూ వుంటారు. ప్రతి మగాడూ ముందు ఎదుటివాడి స్త్రీ మీద దాడిచేస్తాడు, ఏకంగా స్త్రీ మీదైతే ఇక పగ్గాలే వుండవు వీళ్లకి.


ఇలాంటివాళ్లకి ఆడదంటే శరీరమే. అదికూడా బలహీనమైందని తమ తండ్రి, తాత, ముత్తాలు నూరిపోసిన భావజాలమే. నిజానికి తమకున్న ఒక ప్రత్యేక అంగాన్ని చూసుకుని విర్రవీగే ఈ మగాడు అదే అంగంతో అదే ఆడదానికున్న అంగంతో పట్టుమని పది నిముషాలు పడకగదిలో పోరాడలేడు.

తనకున్న ప్రత్యేక అంగంతో స్త్రీని గెలవలేని ప్రతి మగాడూ, తన ఓటమిని, ఆత్మన్యూనతని కప్పిపుచ్చుకునేందుకు సర్వ సాధారణంగా ఎంచుకునే ప్రత్యామ్నాయం నోరు. పురాణాలూ, పవిత్ర గ్రంధాలు, కీర్తనలూ, దైవత్వాలూ వల్లెవేసి స్త్రీని తక్కువగా చిత్రీకరించిన ఈ ఈ నోటినే వాళ్లని దిగజార్చడానికి వాడతాడు. అంటే బూతులు మాట్లాడతాడు. పడకగదిలో చేయలేనివన్నీ బజార్లో మాట్లాడతాడు.

థూ, పాలుతాగి రొమ్ముగుద్దే జాతి.

భూమ్మీద అన్నిటికన్నా నీచమైన జన్మ.

- Siddharthi Subhas Chandrabose

- Gold Rates:బంగారం ధరలు మళ్లీ ఢమాల్..

- Ram gopal varma:నేను నీకు సేవ చేస్తా.. మరో యాంకర్ ని పడేసిన ఆర్జీవి..!

- Remedies For Acidity : కడుపులో మంట(ఎసిడిటి) ఇలా తగ్గించుకోండి

Next Story
Share it