Top
Batukamma

హైదరాబాద్ రోడ్లపై డబుల్ డెకర్ బస్సులు.. అబ్బో నిజంగానే తిరిగేస్తాయా..?

హైదరాబాద్ రోడ్లపై డబుల్ డెకర్ బస్సులు.. అబ్బో నిజంగానే  తిరిగేస్తాయా..?
X
Highlights

సాక్షాత్తు కేటీఆర్ అడిగాక పువ్వాడ అజయ్ స్పందించకుండా ఉంటారా..? వెంటనే ఆయన కూడా రిప్లై ఇచ్చారు.

Double decker buses in hyderabad: ఇవాళ ఉదయం నుంచి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మంత్రి కేటీఆర్ ట్వీట్ చేయడంతో ఆ వార్తకు మరింత ప్రాధాన్యత పెరిగింది. అదే హైదరాబాద్ లో డబుల్ డెక్కర్ బస్సుల నడపటం గురించి.

హైదరాబాద్ లో డబుల్ డెక్కర్ బస్సులు నడపాలంటూ ఓ వ్యక్తి కేటీఆర్ కు ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్.. తన గత స్మృతులను గుర్తు చేసుకున్నారు. అబిడ్స్ లోని సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్ కు డబుల్ డెక్కర్లో వెళ్లిన రోజులను గుర్తుకు తెచ్చుకున్నారు.

హైదరాబాద్ రోడ్లపై సంచరించే డబల్ డెక్కర్ బస్సులను ఎందుకు నిలిపివేశారో అర్థంకాలేదంటూ ట్వీట్ చేశారు. హైదరాబాద్ లో డబుల్ డెక్కర్ బస్సులను మళ్లీ తీసుకొచ్చేచ అవకాశం ఉందా..? అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కు ట్వీట్ చేశారు కేటీఆర్.

సాక్షాత్తు కేటీఆర్ అడిగాక పువ్వాడ అజయ్ స్పందించకుండా ఉంటారా..? వెంటనే ఆయన కూడా రిప్లై ఇచ్చారు. సాధ్యాసాధ్యాలపై ఆర్టీసీ ఎండీతో మాట్లాడతానంటూ ట్వీట్ చేశారు.

ఇంకేముంది.. హైదరాబాద్ లో డబుల్ డెక్కర్ బస్సులు చూసినవాళ్లు.. చూడని వాళ్లు.. ఇప్పుడు అంతా వాటి గురించే చర్చించుకుంటున్నారు.

అప్పట్లో అంటే ఓ పదిహేనేళ్ల క్రితం హైదరాబాద్ లో డబుల్ డెక్కర్ బస్సులు నడిచాయి. అయితే.. ఆ బస్సులు నడిచేందుకు అప్పుడు రోడ్లు అనుకూలంగా ఉన్నాయి. బస్సు ఎత్తుకు తగిన పరిస్థితులున్నాయి.

కానీ ఇప్పుడు హైదరాబాద్ పరిధిలో డబుల్ డెక్కర్ బస్సులు నడపడటం సాధ్యమయ్యే పనేనా..? అనేది కాస్త ఆలోచించాలి. ఎందుకంటే.. చిన్నపాటి రోడ్డులో మామూలు సిటీ బస్సే తిరగలేని పరిస్థితి ఉంది.

ఇక.. ఏదైనా జిల్లా నుంచి వచ్చిన బస్సు పైన లగేజీ వేసుకుని వస్తే ఏదో ఒక చోట ప్రమాదం జరగడం ఖాయం. ఎందుకంటే.. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో ఫ్లై ఓవర్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలున్నాయి. అంతేకాదు.. విద్యుత్ లైన్లు చాలా చోట్ల ప్రమాదకరంగా ఉన్నాయి.

వీటన్నింటికి మించి.. హైదరాబాద్ రోడ్లపై కేబుల్స్ ఓ వలలాగా ఏర్పడి ఉంటాయి. వందల కేబుల్స్ వేలాడుతూ కనిపిస్తుంటాయి. కాస్త హైట్ ఎక్కువున్న లారీలు, బోర్ వెల్ మెషిన్లు, ఫైర్ సేఫ్టీ వెహికల్ వెళ్తేనే చాలా రోడ్లలో కేబుల్స్ దెబ్బకు తిప్పలు తప్పడం లేదు.

మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు డబుల్ డెక్కర్ బస్సులు తిప్పాలంటే సాధ్యమయ్యే పనేనా..? డబుల్ డెక్కర్ బస్సులు(Double decker buses in hyderabad) పెడితే టూరిజం డెవలప్ అవుతుందని సర్కారు సమర్థించుకోవచ్చు గాక. కానీ.. అవి రోడ్డెక్కడానికి ... ఆ రోడ్ల మీద తిరగడానికి అయ్యే ఖర్చుతో పోలిస్తే.. వాటి ద్వారా పెరిగే టూరిజం ద్వారా ఆదాయం ఏ మేరకు ఉంటుందనేది ఆలోచించాల్సిన విషయం.

పబ్లిసిటీ కోసం ప్రజాధనం వృథా చేయకుండా.. మంచి పనులకు ఉపయోగిస్తే బాగుంటుంది.


Next Story
Share it