Top
Batukamma

దుబ్బాక ఎగ్జిట్ పోల్స్ తో గులాబీ నేతల్లో గుబులు..!

దుబ్బాక ఎగ్జిట్ పోల్స్ తో గులాబీ నేతల్లో గుబులు..!
X
Highlights

దుబ్బాక ఎగ్జిట్ పోల్స్ ను పరిశీలిస్తే.. అధికార పార్టీకి మరింత బీపీ పెరిగే పరిస్థితి ఏర్పడింది.

Dubbaka Bypolls Exit Polls: అసెంబ్లీ ఎన్నికలు, ఉపఎన్నికల ఘట్టం ముగిసింది. దీంతో అధికారికంగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు బయటకు వస్తున్నాయి. అయితే.. దుబ్బాక ఎగ్జిట్ పోల్స్ ను పరిశీలిస్తే.. అధికార పార్టీకి మరింత బీపీ పెరిగే పరిస్థితి ఏర్పడింది.

ఓ రెండు సంస్థల ఫలితాలను పరిశీలిస్తే.. ఓ సంస్థ క్లియర్ కట్ గా బీజేపీకి, మరో సంస్థ టీఆర్ఎస్ కు మెజార్టీ వస్తుందని చెబుతున్నాయి. అయితే టీఆర్ఎస్ కు మెజార్టీ వస్తే మాత్రం అది టఫ్ ఫైట్ అని చెబుతోంది.

మిషన్ చాణక్య అనే సంస్థ దుబ్బాక ఎన్నికలపై సర్వే చేసింది. ఇందులో టీఆర్ఎస్ 66,150 ఓట్లు, బీజేపీకి 75,939 ఓట్లు వస్తాయని చెప్పింది. అంటే దాదాపుగా బీజేపీకి పదివేల ఓట్లు ఎక్కువగా వచ్చే అవకాశముందన్నమాట. ఇక కాంగ్రెస్ పార్టీ 19,193 ఓట్ల వరకు వచ్చే ఛాన్స్ ఉందని మిషన్ చాణక్య అనే సంస్థ చెబుతోంది.

దుబ్బాక నియోజకవర్గంలోకి మొత్తం 7 మండలాల్లో ఒకే ఒక మండలంలో టీఆర్ఎస్ కు ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశముందని అంటోంది. కాంగ్రెస్ కు డిపాజిట్ వచ్చే అవకాశమే లేదంటోంది.

ఇక.. ఆరా అనే మరో సంస్థ కూడా దుబ్బాక ఎన్నికలపై సర్వే చేసింది. అయితే.. ఈ సర్వే ప్రకారం దుబ్బాకలో టీఆర్ఎస్ 48.72 శాతం ఓట్లు సాధించి.. మొదటిస్థానంలో ఉంటుందని చెప్పింది. బీజేపీ 44.64 శాతం ఓట్లతో రెండో స్థానంలో కాంగ్రెస్ 6.12 శాతం ఓట్లతో మూడో స్థానానికే పరిమితం అవుతుందని చెబుతోంది.

అయితే.. అధికార పార్టీ మాత్రం ఫుల్ మెజార్టీతో తామే గెలుస్తామని అంటోంది. అటు బీజేపీ కూడా ఇదే మాట చెబుతోంది. సర్వేలు (Dubbaka Bypolls Exit Polls) మాత్రం ఇద్దరి మధ్య పోటా పోటీ ఉంటుందని చెబుతున్నాయి. సో.. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం దుబ్బాక ఫలితాలు అధికార పార్టీకి మరింత టెన్షన్ పుట్టిస్తున్నాయి.

ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రుల సొంత జిల్లాలో ఓడిపోతే పరిస్థితి ఏంటని.. గులాబీ లీడర్లు గుబులు పడుతున్నారట.

- మరోసారి రెచ్చిపోయిన ప్రియా ప్రకాశ్ వారియర్

- మత మార్పిడులపై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

Next Story
Share it