Top
Batukamma

గెలిస్తే కేసీఆర్.. ఓడితే హరీష్ రావు.. ఆ మాజీ ఎంపీ దిమ్మదిరిగే ట్వీట్!

గెలిస్తే కేసీఆర్.. ఓడితే హరీష్ రావు.. ఆ మాజీ ఎంపీ దిమ్మదిరిగే ట్వీట్!
X
Highlights

కేసీఆర్, కేటీఆర్ వ్యూహం దుబ్బాకలో బాగా పని చేసింది. ఒకవేళ ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచి ఉంటే ఆ విజయం కేసీఆర్ ఖాతాలోకి వెళ్లిపోయేది..

ఏంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దుబ్బాక ఉప ఎన్నికలలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఊహించని షాక్ ఇచ్చారు దుబ్బాక ప్రజలు.. ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో ఫైనల్ గా బీజేపీకే పట్టం కట్టారు.. దీనితో మొదటిసారిగా దుబ్బాక గడ్డపై బీజేపీ జెండా ఎగిరింది. అయితే టీఆర్ఎస్ ఓటమి పట్ల పలువురు రాజకీయ నాయకులు తమ విశ్లేషణను ఇస్తున్నారు..అందులో భాగంగానే కాంగ్రెస్ నేత, చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు..

"కేసీఆర్, కేటీఆర్ వ్యూహం దుబ్బాకలో బాగా పని చేసింది. ఒకవేళ ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచి ఉంటే ఆ విజయం కేసీఆర్ ఖాతాలోకి వెళ్లిపోయేది.. కానీ టీఆర్ఎస్ ఓడిపోతే హరీష్ రావు పరాజయమే అని అంటారు. కేసీఆర్, కేటీఆర్ అనుసరించిన ఈ మార్గం వారిపై వీరిద్దరిపై అభిప్రాయమే కల్పించింది. ఓడినందుకు ఆ బాధ్యత టీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్‌పై కాకుండా ఇప్పుడు హరీష్ రావుపైనే పడింది. కానీ, ఇక్కడ అసలు నిజం ఏంటంటే.. వాస్తవానికి వారే ప్రజల్లో, క్యాడర్‌లో అభిమానం కోల్పోతున్నారు." అని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ట్వీట్ చేశారు.

ఇక ఈ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు స్వల్ప పట్ల మెజారిటీతో గెలిచాడు.. అటు ఓట్ల పరంగా చూసుకుంటే రఘునందన్ రావుకు 62,772 ఓట్లు రాగా, సోలిపేట సుజాతకి 61,302 ఓట్లు వచ్చాయి. అటు కాంగ్రెస్ అభ్యర్ధి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి 21,819 ఓట్లు వచ్చాయి.

Next Story
Share it