Top
Batukamma

ముగ్గురు పిల్లలున్నా.. కల్యాణలక్ష్మి కోసం కక్కుర్తి.. అడ్డంగా దొరికారు..!

ముగ్గురు పిల్లలున్నా.. కల్యాణలక్ష్మి కోసం కక్కుర్తి.. అడ్డంగా దొరికారు..!
X
Highlights

దళిత, గిరిజన, బీసీ, ఓబీసీ కులాలకు చెందిన యువతుల వివాహాల కోసం రూ.1,00,116 చొప్పున ఆర్థిక సాయం చేస్తుంది ప్రభుత్వం.

కళ్యాణ లక్ష్మి పథకాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అందరికీ తెలిసిందే.. నిరుపేద యువతులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ముందుకు తీసుకువచ్చింది. దళిత, గిరిజన, బీసీ, ఓబీసీ కులాలకు చెందిన యువతుల వివాహాల కోసం రూ.1,00,116 చొప్పున ఆర్థిక సాయం చేస్తుంది ప్రభుత్వం.. అయితే ఇప్పుడు ఈ పథకాన్ని కొందరు అభాసుపాలు చేస్తున్నారు.

ఈ పథకం ప్రారంభం కాకముందు వివాహాలు ఇటీవలే జరిగినట్లుగా నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి డబ్బులు కాజేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలం బాలాజీపేటకు చెందిన ముగ్గురు మహిళలకు ఐదేళ్ల క్రితం, మరో మహిళకు రెండేళ్ల క్రితం వివాహాలు జరిగాయి. అయితే వీరు ఈ మధ్యే పెళ్ళైనట్టుగా నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు.

వీరికి కల్యాణలక్ష్మి చెక్కులు కూడా మంజురయ్యాయి. అయితే స్థానికులకి అనుమానం వచ్చి అధికారులకి ఫిర్యాదు చేయగా అసలు కథ బయటపడింది. దీంతో ఆ నలుగురికి సంబంధించిన చెక్కులను నిలిపివేశామని తహసీల్దార్‌ నాగభవాని మంగళవారం తెలిపారు. దీనిపైన జరిగే అక్రమాలను బయటపెట్టి నిందితులను శిక్షించాలని స్థానికులు అంటున్నారు.

ఇక్కడో ఇంకో విషయం ఏంటంటే.. కళ్యాణలక్ష్మి కోసం దరఖాస్తు చేసుకున్న ఈ నలుగురు మహిళలకి ముగ్గురేసి పిల్లలు కూడా ఉన్నారు.

Next Story
Share it