Top
Batukamma

పొంచి ఉన్న మరో గండం: మరో మూడు రోజులు భారీ వర్షాలు

పొంచి ఉన్న మరో గండం: మరో మూడు రోజులు భారీ వర్షాలు
X
Highlights

ఒకసారి ఇంటిని శుభ్రం చేసుకునే లోపే మరోసారి వరద వచ్చి ఇంటిని ముంచేస్తోంది

రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. ముఖ్యంగా హైదరాబాద్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ అధికారులు అప్రమత్తమయ్యారు.

అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జోనల్ కమిషనర్లను ఆదేశించారు గ్రేటర్ మున్సిపల్ కమిషనర్. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు.

వారం రోజులుగా నగరంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో కాలనీలన్ని నీట మునిగాయి. వరద, బురదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే నీట మునిగిన ఇళ్లను శుభ్రం చేసుకోలేక... అందులో ఉండలేక తిప్పలు పడుతున్నారు.

ఒకసారి ఇంటిని శుభ్రం చేసుకునే లోపే మరోసారి వరద వచ్చి ఇంటిని ముంచేస్తోంది. ఇలాంటి సమయంలో మరోసారి భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో గ్రేటర్ ప్రజలు గజగజ వణికిపోతున్నారు.

Next Story
Share it