Top
Batukamma

Dubbaka By Elections : దుబ్బాక పోటిలో ఉన్న 23 మంది అభ్యర్ధులు వీళ్ళే!

Dubbaka By Elections : దుబ్బాక పోటిలో ఉన్న 23 మంది అభ్యర్ధులు వీళ్ళే!
X
Highlights

కొద్దిసేపటి క్రితమే పోలింగ్ స్టార్ట్ అయింది... మొత్తం ఈ పోలింగ్ ఈ రోజు సాయంత్రం ఆరు గంటల వరకు జరుగనుంది.

Dubbaka By Elections : దుబ్బాకలో కొద్దిసేపటి క్రితమే పోలింగ్ స్టార్ట్ అయింది... మొత్తం ఈ పోలింగ్ ఈ రోజు సాయంత్రం ఆరు గంటల వరకు జరుగనుంది. మొత్తం ఈ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులు సహా మొత్తం 23 మంది పోటీచేస్తున్నారు.

కానీ ప్రధాన పోటి మాత్రం టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగానే సాగనుంది.. టీఆర్ఎస్ నుంచి సోలిపేట సుజాత, కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ నుంచి రఘునందన్ రావులో పోటిలో ఉన్నారు.

పోటిలో ఉన్నవారు వీళ్ళే!

1. చెరుకు శ్రీనివాసరెడ్డి : భారత జాతీయ కాంగ్రెస్

2. మాధవుని రఘునందన్ రావు : భారతీయ జనతా పార్టీ

3. సోలిపేట సుజాత : తెలంగాణ రాష్ట్ర సమితి

4. కత్తి కార్తీక :. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్

5. గౌటి మల్లేష్ : జై స్వరాజ్ పార్టీ

6.జజులా భాస్కర్ : శ్రమజీవి పార్టీ

7. యం. సునీల్ : ఇండియా ప్రజాబంధు పార్టీ

8. ఎస్. అశోక్ : రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా..

9. కంటే సాయన్న : స్వతంత్ర అభ్యర్థి

10. పి.యం బాబు : స్వతంత్ర అభ్యర్థి

11. బుట్టెంగారి మాధవ రెడ్డి : స్వతంత్ర అభ్యర్థి

12. బండారు నాగరాజు : స్వతంత్ర అభ్యర్థి

13. మోతే నాగరాజు : స్వతంత్ర అభ్యర్థి

14. రాణవేణి లక్ష్మణరావు : స్వతంత్ర అభ్యర్థి

15. రాపెల్లి శ్రీనివాస్ : స్వతంత్ర అభ్యర్థి

16. వడ్ల మాధవ చారి : స్వతంత్ర అభ్యర్థి

17. వేముల విక్రమ్ రెడ్డి : స్వతంత్ర అభ్యర్థి

18. సిలివేరు శ్రీకాంత్ : స్వతంత్ర అభ్యర్థి

మరికొందరు స్వతంత్ర అభ్యర్ధులు కూడా పోటిలో ఉన్నారు.

ఇక దుబ్బాక నియోజకవర్గ ప్రజలు ఇప్పటివరకు టీఆర్ఎస్ పార్టీనే గెలిపిస్తూ వచ్చారు. . 2004 నుంచి ఇప్పటివరకు మొత్తం ఐదుసార్లు ఎన్నికలు జరుగగా అందులో నాలుగు సార్లు టీఆర్ఎస్ అభ్యర్ధి సోలిపేట రామలింగారెడ్డి గెలిచారు.. 2004, 2008(ఉప ఎన్నిక), 2014, 2018 ఎన్నికల్లో సోలిపేట రామలింగారెడ్డి గెలిచారు. ఇక 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి చెరుకు ముత్యంరెడ్డి గెలిచారు.

సోలిపేట రామలింగారెడ్డి గెలిచిన ప్రతిసారి యాబై శాతానికి పైగా ఓట్లతోనే గెలవడం మరో విశేషం.. ముందుగా టీఆర్ఎస్ కి ప్రత్యర్ధిగా టీడీపీ ఉండగా, ఆ తరవాత కాంగ్రెస్ ఉంది. అయితే ఎప్పటిలాగే ఇప్పుడు కూడా మళ్ళీ టీఆర్ఎస్ గెలవడం ఖాయమని పార్టీ నాయకులు అంటున్నారు. ఈ ఉపఎన్నికకి సంబంధించిన ఫలితాలు ఈ నెల 10 న రానున్నాయి.

Next Story
Share it