పాపం.. పవన్ కల్యాణ్ కి అవేమీ తెలియవు..!

బ్లాక్ మనీ కావాలంటే గూండాగిరి చేయాలి. గూండాగిరి చేయాలంటే ఓ రాజకీయ పార్టీ పెట్టాలి.
రాజకీయాలు(politics) చేయాలంటే బ్లాక్ మనీ కావాలి.
బ్లాక్ మనీ కావాలంటే గూండాగిరి చేయాలి.
గూండాగిరి చేయాలంటే ఓ రాజకీయ పార్టీ పెట్టాలి.
అన్ని రాజకీయ పార్టీలకు బ్లాక్ మనీ అందించి పెట్టే సంస్థలుంటాయి. రాజకీయ పార్టీలూ ఉంటాయి.
పైకి అందరూ అందర్నీ తిడుతుంటారు.
లోపల లోపాయికారిగా బ్లాక్ మనీ అందించే రాజకీయ పార్టీతో సంబంధాలుంటాయి.
అన్ని రాజకీయ పార్టీలూ కలిసి సీక్రెట్ గా ఆ రాజకీయ పార్టీని తమ బిడ్డలాగా చూసుకుంటూ ఉంటాయి. వేదికల మీద మాత్రం బెమ్మాండంగా తిట్టి పోస్తుంటాయి.
పాపం పవన్ కళ్యాణ్(pawan kalian) కి అవేమీ తెలియదు. స్పీచులకు, పుస్తకాల్లో ఉండే ఆదర్శాలకూ వోట్లు పడిపోతై అనుకుంటడు. అందుకే ఒక పార్టీ నుండి మరో పార్టీకి దగ్గరగా దూకుతున్నడు. ఇప్పటికైనా అన్ని పార్టీలు ఒక్క పార్టీ నుంచే తమకు కావలసిన నిధులు సమకూర్చుకుంటాయని తెలుసుకున్నడో లేదో.
కనీసం "ముంబై షెహర్ కో పిషాప్ కరానే ఆయా హు!" అనే డైలాగ్ ఉండే "బిజినెస్ మ్యాన్" సినిమా చూసినా అర్థమై ఉండేది. పూరీ జగన్నాథ్ చాలా స్టడీ చేసి తీసిన సినిమా (ఆయన తీసిన ఏకైక బెస్ట్ సినిమా). గూండాగిరి చేయడం కోసమే ఓ రాజకీయ పార్టీ ఉంటుందని అది అన్ని రాజకీయ పార్టీలకు బ్లాక్ మనీని సహాయం చేస్తూ ఉంటుందని ఆ సినిమా చూస్తే అర్థమౌతుంది.
ప్రతి పార్టీ ప్రతి ఒక్కడికీ ఓటుకు మూడు వేలు పంచాలంటే హైద్రాబాద్ షహర్ ని ఉచ్చ పోయించేవాడు ఒకడుండింటాడు. వాడెవడనేది మనకు తెలియాలి. మనకు తెల్సు కానీ తెల్వదు. తెల్వనీయరు. అంతే!.
.. విరించి విరివింటి