Top
Batukamma

గ్రేటర్ లో పవన్ ని వాడుకొని వదిలేసిన బీజేపీ!

గ్రేటర్ లో పవన్ ని వాడుకొని వదిలేసిన బీజేపీ!
X
Highlights

గ్రేటర్ లో మంచి ఫలితాలు రావడంతో ఆ పార్టీ నేతలు పుల్ జోష్ లో ఉన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి అభినందనలు తెలుపుతున్నారు. అటు బండి సంజయ్ కూడా ఫుల్ ఖుషిలో ఉన్నాడు.

గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. కనీసం ఆ పార్టీ నేతలు కూడా అంచనా వేయని సీట్లను గెలుచుకుంది బీజేపీ. సింగిల్ లార్జెస్ట్ పార్టీ టీఆర్ఎస్ అయినప్పటికీ నైతిక విజయం మాత్రం బీజేపీదేనని చెప్పాలి.

గ్రేటర్ లో మంచి ఫలితాలు రావడంతో ఆ పార్టీ నేతలు పుల్ జోష్ లో ఉన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి అభినందనలు తెలుపుతున్నారు. అటు బండి సంజయ్ కూడా ఫుల్ ఖుషిలో ఉన్నాడు. పార్టీ గెలుపు కోసం పనిచేసిన పలువురికి ధన్యవాదాలు తెలిపాడు.

ఎన్నికల ప్రచారానికి వచ్చిన బీజేపీ అగ్ర నేతల నుంచి కార్యకర్తల వరకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపాడు. ఈ గెలుపును ఎన్నికల అధికారి, డీజీపీకి అంకితం చేస్తున్నట్టుగా ప్రకటించారు బండి సంజయ్. అటు బీజేపీకి ఓటేసిన హైదరాబాదు ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్టుగా పేర్కొన్నాడు సంజయ్.

అయితే అందరి పేర్లు చెప్పిన సంజయ్.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరును మాత్రం మరిచిపోయారు. ఎక్కడ కూడా అయన పేరు చెప్పలేదు. దీనితో బండి సంజయ్ తీరుపైన జనసైనికులు ఫైర్ అవుతున్నారు. పార్టీకి సపోర్ట్ చేసి ఈ రోజు గెలుపుకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కారణమేనని అది గుర్తుపెట్టుకోవాలని అంటున్నారు.

ముందుగా గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పార్టీ సింగిల్ గానే పోటీ చేయాలని అనుకుంది. అందుకోసం ఏకంగా 60 మందికి పైగా అభ్యర్థులు నామినేషన్లు కూడా వేశారు కూడా.. అయితే జనసేన పోటి చేస్తే ఓట్లు చీలిపోయే ప్రమాదం ఉండడంతో బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్ పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లి చర్చలు జరిపారు. దీంతో ఎన్నికల్లో పవన్ ఈ ఎన్నికల నుంచి తప్పుకొని, బీజేపీకి మద్దతు ప్రకటించారు. దీనితో వారు నామినేషన్లు ఉపసంహరించుకోవాలని పరిస్థితి వచ్చింది.

ఈ రకంగా బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించిన పవన్ పేరును బండి సంజయ్ ప్రస్తావించకపోవడం పట్ల జనసేన శ్రేణులు ఫైర్ అవుతున్నారు 'మీరు అడిగారని జనసేన అభ్యర్దులు నామినేషన్లు అన్ని విత్ డ్రా చేసుకున్నారు. కనీసం వాళ్ళకి కృతఘ్నత కూడా చెప్పవా? ఏమండీ సంజయ్ గారు. జనసేన కార్య కర్తలు చేసిన ప్రచారం మర్చిపోయారా? పవన్ కళ్యాణ్ గారిని వాడుకుని, అవసరం తీరాక పక్కన పెడదాం అని చూస్తే, టీడీపీకి పట్టిన గతే మీకు పడుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story
Share it