Top
Batukamma

ఇంత వెరైటీగా ఎవరూ రాజకీయ పార్టీలో చేరి ఉండరు..! జీవితమ్మ ఏందిది..?

ఇంత వెరైటీగా ఎవరూ రాజకీయ పార్టీలో చేరి ఉండరు..! జీవితమ్మ ఏందిది..?
X
Highlights

వరుస జంపింగ్ లతో ఆమె ఏ పార్టీలో ఉన్నో తెలుసుకోవడం కూడా కాస్త కష్టంగానే మారుతోంది.

Jeevitha rajasheker joins bjp : చీర మార్చినంత ఈజీగా పార్టీలు మారుతోంది నటి జీవిత(jeevitha). ఇప్పుడు మళ్లీ పార్టీ మారారు. వరుస జంపింగ్ లతో ఆమె ఏ పార్టీలో ఉన్నో తెలుసుకోవడం కూడా కాస్త కష్టంగానే మారుతోంది. గతంలోనూ ఇదేపార్టీలో ఉన్న జీవిత.. ఇప్పుడు మళ్లీ అదే పార్టీలోకి చేరారు.

హైదరాబాద్ లోని బీజేపీ ఆఫీస్ లో బండి సంజయ్(bandi sanjay) సమక్షంలో బీజేపీ కండువా కప్పేసుకున్నారు జీవిత. ఈ సారి మాత్రం దంపతులిద్దరు చేరకుండా.. కేవలం జీవిత మాత్రమే పార్టీలో చేరింది. అయితే.. అక్కడే ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.

పార్టీలో చేరేందుకు వచ్చిన జీవితకు కండువా కప్పేందుకు నిరాకరించారు బండి సంజయ్. దీంతో అంతా షాక్ అయ్యారు. చివరకు తనంతట తానే కండువా తీసి కప్పుకున్నారు. ఇది చూసి అక్కడున్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. సాధారణంగా పార్టీ మారినప్పుడు అక్కడున్న ముఖ్యనేతలు కండువాలు కప్పి ఆహ్వానిస్తారు. కానీ ఇలా జీవిత తనంతట తానే కండువా కప్పుకోవడం ఇప్పు హాట్ టాపిక్ అయ్యింది.


ఇక.. జీవితా రాజశేఖర్ పార్టీలు మారడం గురించి చెప్పుకోవాలంటే చాలా పెద్ద లిస్టే ఉంటుంది. 2014లో జీవిత, రాజశేఖర్ బీజేపీ(bjp)లో చేరారు. అప్పటి బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్(rajnath singh) సమక్షంలో బీజేపీలో చేరారు. ఆ తర్వాత వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ(ysrcp) తీర్థం పుచ్చుకున్నాడు.

అక్కడితో ఆగలేదు.. వైసీపీని కాదని చంద్రబాబుకు మద్దతు ప్రకటించారు. అక్కడ నిలకడగా ఉండలేకపోయారు. 2019 ఎన్నికల ముందు.. మళ్లీ వైఎస్సార్ సీపీ కండువా కప్పుకున్నారు. వీళ్ల జంపింగ్ యవ్వారాలు చూసి.. వీరిని కాస్త దూరంగా పెట్టారు జగన్మోహన్ రెడ్డి. దీంతో ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న జీవిత.. ఇప్పుడు మళ్లీ బీజేపీలోకి జంప్ అయ్యింది.

- మా కార్యకర్తలు రోడ్డెక్కితే జగన్ మూటాముల్లె సర్దుకోవాలి : బండి సంజయ్!

- వేరే మహిళతో దొరికిన భర్త.. కట్టేసి కొట్టేసిన భార్య!

- రూట్ మార్చిన రామోజీ.. డైరెక్ట్ మోడీపైనే పోరాటం..!

- ఎవడు కొడితే దిమ్మదిరిగి మైండ్ బ్లాంక్ అవుద్దో.. అతడే....!

- పాపం సోము వీర్రాజు.. అయిపాయె..!

Next Story
Share it