Top
Batukamma

పంచాయతీ సెక్రటరీ కొలువు కంటే.. పత్తి చేన్లో కూలీ బతుకు నయం

పంచాయతీ సెక్రటరీ కొలువు కంటే.. పత్తి చేన్లో కూలీ బతుకు నయం
X
Highlights

మూడు నెలల నుండి జీతం లేదు ఓ పెళ్ళాం లేదు ఓ సరదా లేదు ఓ అవ్వ లేదు ఓ అయ్య లేదు

పొద్దున 5 గంటలకు లేచి టక టక రెడీ అయి సర్వే కి వెళ్ళాలి మళ్ళీ రాత్రి 7 లేదా 8 గంటలకు ఇంటికి వచ్చి స్నానం చేసి బుక్కెడంతా తినుకుంటు రిపోర్ట్ లు పంపుకుంటు ఒక గంట అటు ఇటు గడిపిన తరువాత ఫుల్లు నిద్ర.

ఇక ఎటు మనసున పట్టక రిలాక్స్ గా పడుకుని కంటి నిండా నిద్ర పోదాం అనుకునే సరికి మళ్ళీ తెల్లారి మబ్బుల 5 గంటలకు ఫోన్ మొగుద్ది చలో గ్రామ పంచాయతీ కి అని.

టైం కు తిండి లేక సరిగా తినక సర్వే సర్వే అని ఊరు పట్టుకుని ఎంత తిరిగిన ఒడవట్లేదు ఆధార్ కార్డులో ఒక ఇంటి నంబర్ ఉంటే రేషన్ కార్డులో మరో నంబర్ ఉంటుంది.

మాండ్ రిజిస్టర్ లో ఒక నంబర్ ఉంటే సర్వే చేసే ఆప్ లో ఇంకో నంబర్ ఉంటుంది ఇళ్ళు ఎవరి పేరు మీద ఉందొ ఇంటి యజమానులకె తెలియని పరిస్థితి.

యజమాని నింపాల్సిన అప్లికేషన్ ఫామ్స్ ని యజమానులకు ఇస్తే వాళ్లకు నింపరాదు మళ్ళీ వాళ్ళు వచ్చి సార్ ఇదెట్ల నింపుడు అని నన్నే అడుగుతారు.

సరే సిబ్బంది తో రాయిద్దాం అంటే యజమాని రేషన్ కారట టైం కి దొరకదు ఆధార్ కారట్లు టైం కి దొరకవు ఎక్కడ పెట్టావు అని తల్లి కొడుకుని కొడుకు తండ్రిని తండ్రి బిడ్డని అడిగే సరికి అవి వచ్చే సరికి ఆ ఒక్క ఇంటి దగ్గరే గంట గడుస్తది.

ఈలోగా 7 AM రిపోర్ట్ అని ఒకసారి 9 am రిపోర్ట్ అని ఒకసారి 11 Am రిపోర్ట్ అని ఇంకోసారి ఒక రోజులో ప్రతి రెండు గంటలకు ఒకసారి రిపోర్ట్ పంపాలి ప్రతి గంటకి కనిసం 15 ఇళ్ళు చేయాలి ఇక్కడ చూస్తే ఆధార్ కారట్లు దొరకవు ముందుగా చెప్పిన అవి దగ్గర పెట్టుకోరు.

అన్ని దగ్గర ఉన్న ఆప్ సర్వర్ డౌన్ అయ్యి డీటెయిల్స్ ఎంటర్ కావు సర్వర్ కరెక్ట్ గా ఉన్నపుడు సిగ్నల్ రాదు అన్ని వివరాలు ఎంటర్ చేసి సేవ్ బటన్ నొక్కిన్నంక ఫోన్ స్ట్రక్ అవుద్ధి ఇక అక్కడి నుండి మొదలవుద్దీ టెన్షన్ ఓ దిక్కు ఫోన్ స్ట్రక్ అవుద్దీ ఇంకో దిక్కు ఫోన్లు వచ్చి సిగ్నల్ కట్ అవుద్దీ మరో దిక్కు రిపోర్ట్ ఎక్కడ అని ఆఫీసర్ల నుండి ఫోన్లు.

సందట్లో సడెమియా లాగా ఈజిఎస్ అఫీస్ నుండి ఫోన్లు సార్ ఊర్లో వాళ్లకు పని పెట్టాలి మస్టర్లు తీసుకు వెళ్ళండి నర్సరీ వనసేవక్ మస్టర్లు పంపించండి అని ఒకరు ఇంకుడు గుంతలు ఎన్ని అయినాయ్ అని మరొకరు ఆడిట్ అని మల్లోకరు.. శానిటేషన్ ఫోటోలు పంపుమని కంప్యూటర్ ఆపరేటర్లు కరెంట్ బిల్లు కట్టుమని ఎంపిఓ లు ఈ పనులు అదనం.

ఇక సర్వే రిపోర్ట్ ప్రతి రెండు గంటలకు ఒకసారి 15 కన్నా తక్కువ పంపితే ఎంపిడిఓ నుండి పది సార్లు ఎంపిఓ నుండి 2 సార్లు ఫోన్ వస్తది.. ఇక ఆ రోజులో టార్గెట్ కాకుంటే తెల్లారి పొద్దుగాళ్ల ఆడిషన్ కలెక్టరో లేదా మండల స్పెషల్ ఆఫీసరో ఊర్లో దిగుతారు.

వచ్చి రావడం తోనే ఎన్ని చేశావ్ ఇంకెన్ని చేయాలి ఇన్ని చేశాం సార్ అంటే అంత తక్కువ ఎందుకు చేస్తున్నావ్ రేపటి లోగా కంప్లిట్ చేయకుంటే సస్పెండ్ అంటారు.. మనం సర్వర్ డౌన్ సిగ్నల్ ప్రాబ్లమ్స్ ఫీల్డ్ సమస్యలు చెప్పక ముందే... వాళ్ళొక మాట అంటారు.

సిగ్నల్ ప్రాబ్లమ్ సర్వర్ డౌన్ యజమానులు డాటా ఇవ్వట్లేదు వాళ్లకు ఫామ్స్ రాయస్తలేదు అని కాకమ్మ కతలు మాకు వద్దు ఎందుకు చేయలేదో ఒకటే రీజన్ చెప్పు అంటారు ఖతం దెబ్బకి మైండ్ స్విచ్చాఫ్..

ఇవన్నీ ఫేస్ చేసిన తరువాత చివర్లో రాత్రి పడుకునే ముందు అనిపిస్తది మూడు నెలల నుండి జీతం లేదు ఓ పెళ్ళాం లేదు ఓ సరదా లేదు ఓ అవ్వ లేదు ఓ అయ్య లేదు ఓ ఫ్యామిలీ తో గడిపే సమయం లేదు తు దీనమ్మ జీవితం ఈ నౌకరి వదిలేసి సప్పుడాకా ఎవరికైనా గుత్త పత్తి ఏరడానికి కైకిలి పోయింది నయం అని.

ఎలాంటి పని అయినా చేసే నేను ఇలాంటి ప్రెజర్ తో చేయడం వల్ల చేసే పని శ్రద్ధగా చేయలేక నరకం కనిపిస్తుంది ఈ ఒత్తిడి తట్టుకోలేక ఎందుకనో మీతో పంచుకోవాలి అనిపించింది.

Next Story
Share it